శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: సోమవారం, 24 ఆగస్టు 2015 (18:45 IST)

నా బుద్ధి మారడం లేదు... ఆమెతో పాల్గొన్నా హ.ప్ర చేస్కుంటున్నా... నిమిషంలోనే...

నా బుద్ధి మారడం లేదు. నా ప్రేయసితో సెక్సులో పాల్గొంటాను. అయినా మళ్లీ ఇంటికి వచ్చి హస్త ప్రయోగం చేస్కుంటాను. ఆమెతో సెక్సులో పాల్గొనేటపుడు ఒకే ఒక్క నిమిషంలో వీర్యాన్ని స్ఖలించేస్తున్నా. ఈ శీఘ్ర స్ఖలన సమస్యను అడ్డుకోవాలని ఎన్నోమార్లు ప్రయత్నించినా సక్సెస్ కాలేకపోయాను. ఇప్పుడు నా ప్రేయసి నావైపు అనుమానంగా చూస్తోంది. సెక్స్ పేరు చెబితే... డాక్టరు వద్ద చూపించుకుని అప్పుడు చూద్దాంలే అంది. ఇక అప్పట్నుంచి మరీ తల కొట్టేసినట్లు అయిపోతోంది. అసలు ఈ సమస్య నుంచి బయటపడేదెలా...?
 
శీఘ్రస్ఖలన సమస్యకు చికిత్స ఉంది. పురుషుల సెక్స్ సమస్యల నిపుణుడితో సంప్రదించి సమస్య ఏమిటో చూపించండి. దానికి కారణం తెలుసుకుని తగిన చికిత్స అందిస్తాడు. ముఖ్యంగా పెళ్లికాక మునుపే సెక్స్ అంటే, మనసులో భయం చోటుచేసుకుంటుంది. ఆ కారణంగా వీర్యస్ఖలనం ఇలాగే త్వరగా అయిపోతుంది. కనుక పోర్ ప్లేపై అధికంగా దృష్టి సారించాలి. అలాగే హస్త ప్రయోగం వల్ల ఎలాంటి అనారోగ్యం కలుగదు.