శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: మంగళవారం, 22 సెప్టెంబరు 2015 (21:06 IST)

పెళ్లయ్యాక సన్నబడ్డాను... వద్దన్నా అప్పటిలానే అన్నిసార్లు కావాలంటున్నారు...

నా వయసు 31 ఏళ్లు. మా వారి వయసు 36 ఏళ్లు. మాకు ఇద్దరు పిల్లలు. పిల్లలు పుట్టాక నేను చాలా సన్నగా మారాను. నన్ను చూసినవారంతా ఇలా బలహీనంగా ఉన్నావేంటి అంటున్నారు. మావారు మాత్రం చాలా దృఢంగా ఉంటారు. పెళ్లయిన దగ్గర్నుంచి ఆయన నాతో రోజుకు కనీసం ఐదుసార్లు సెక్స్ చేస్తారు. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు. వద్దంటే వినడం లేదు. నా శరీరం సహకరించడంలేదు. తట్టుకోలేకపోతున్నాను. ఆయనలో సెక్స్ కోర్కెలు తగ్గేందుకు మందులు ఏమైనా ఉంటే చెప్పండి...
 
మందులు వాడాల్సింది ఆయన కాదు మీరు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి సెక్సులో అన్నిమార్లు పాల్గొంటున్నారు. మీ ఆరోగ్యం కాస్త సరిచూసుకోండి. దగ్గర్లో ఉన్న గైనకాలజిస్టును సంప్రదిస్తే సమస్య ఏమిటో తెలుస్తుంది. ఆ బలహీనతకు కారణం ఏమిటో తెలుసుకని తగిన చికిత్స చేస్తారు. మీరు ఆరోగ్యంగా మారితే ఇద్దరూ ఆనందంగా దాంపత్య సుఖాన్ని అనుభవించవచ్చు.