శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: మంగళవారం, 17 నవంబరు 2015 (20:52 IST)

ఆమెకు తృప్తి లేదంటోంది... అందుకే పరికరంతో 2 అంగుళాలు పెంచా... హాని ఉంటుందా...?

పెళ్లి చేసుకోలేదు కానీ ముందుగా మేమిద్దరం సెక్స్ పరంగా సామర్థ్యంగా ఉన్నామో లేదో చూసుకోవాలనుకున్నాం. దాంతో ఆమెతో నేను కండోమ్ ధరించి సెక్సులో పాల్గొన్నాను. సెక్స్ ముగిశాక తృప్తిగా ఉందో లేదో నిజంగా చెప్పమన్నాను. ముందుగా ఆమె ఏమీ చెప్పలేదు. ఐతే ఆ తర్వాత తనకు ఏమీ పెద్దగా అనిపించలేదని చెప్పింది. దాంతో నాకు డౌట్ వచ్చింది.


ఎందుకంటే నా పురుషాంగ 2.5 అంగుళాలకు మించి లేదు. పొడవు లేకపోవడంతో ఆమెకు తృప్తి కలుగలేదని అనిపిస్తుంది. అందుకే బజార్లో దొరికే ఓ పరికరాన్ని పురుషాంగానికి పెట్టి మరో రెండు అంగుళాలు పెంచాను. ఇప్పుడు 4.5 అంగుళాలవుతుంది. కాబట్టి ఆమె తృప్తి చెందుతుందని అనుకుంటున్నాను. ఐతే సెక్స్ చేసేటపుడు ఆ పరికరం ఆమెకు ఏదైనా హాని చేస్తుందేమోనని భయమేస్తోంది....
 
పెళ్లికి ముందు ఇలాంటి పిచ్చి పనులు చేయరాదు. పెళ్లి కాకుండా సెక్స్ పరంగా కలవాలనుకోవడం తప్పయితే.. మళ్లీ కృత్రిమ పరికరాలను తీసుకుని వాటితో ప్రయోగం చేయాలనుకోవడం మరీ ప్రమాదకరం. ముందుగా అలాంటి వాటి జోలికి వెళ్లకండి. పెళ్లికి ముందు సెక్సులో పాల్గొనేవారు మానసికంగా ధైర్యం లేకుండా ఉంటారు. తమను ఎవరైనా గమనిస్తారేమోనన్న భయం వారిని సెక్స్ పరంగా తృప్తి చెందనివ్వదు. బహుశా ఆమె అలాంటి ఆందోళన చెంది ఉంటుంది. సెక్స్ పరంగా స్త్రీ తృప్తి చెందడానికి స్తంభించిన పురుషాంగం 2 నుంచి 3 అంగుళాలుంటే చాలు. ఎందుకంటే స్త్రీ యోనిలో కామనాడులు 2 అంగుళాల లోతు వరకే ఉంటాయి.