శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శుక్రవారం, 11 డిశెంబరు 2015 (20:59 IST)

అతడి కోసం అంతగా ఎందుకు తపిస్తున్నానో నాకు అర్థం కావడంలేదు...

నాకు 37 ఏళ్లు. పెళ్లయి ఓ పాపాయి కూడా ఉంది. నా భర్త ఐటీ కంపెనీలో మంచి పొజిషన్. లక్ష రూపాయలకు పైగా జీతం వస్తుంది. మా జీవితం హేపీగా ఉంది. ఐతే ఓ ఆరు నెలల క్రితం నాకు ఫేస్ బుక్ ద్వారా ఒకతడితో పరిచయమైంది. ఎఫ్బీలో చాటింగ్ చేస్తున్న సమయంలో అతడు ఫ్రెండుగా వచ్చాడు. అతడి ఫోటో చూడగానే లైక్ కొట్టాను. ఇక అక్కడ్నుంచి మా పరిచయం చాలా సన్నిహిత సంబంధానికి దారితీసింది. 
 
ఓసారి అతడు ఓ రెస్టారెంట్లో ఉన్నాను... రమ్మంటే వెళ్లాను. డిన్నర్ ఆర్డర్ చేశాడు. ఇద్దరం కలిసి భోజనం చేశాము. ఆ తర్వాత వెళుతూ వెళుతూ మూడుసార్లు ముద్దుపెట్టుకున్నాడు. అతడి ముద్దులో ఏదో తెలియని హాయి కలిగింది. ఇక అప్పట్నుంచి అతడితో ఎక్కువగా కనెక్ట్ అయిపోయాను. అతడితో మాట్లాడనిదే ఉండలేకపోతున్నాను. ముద్దు చాలా బావుందని పదేపదే చెపుతుంటాను. 
 
అలా ఈమధ్య చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉండగా... సెక్స్ లో పాల్గొందామా అని అడిగాడు. అతడి మాటకు నేను నో చెప్పలేదు. కానీ అవుననీ అనలేదు. ఇప్పుడు మళ్లీమళ్లీ అదే అడుగుతున్నాడు. అలాగని అతడితో మాట్లాడకుండా ఉందామంటే వల్లకావడంలేదు. నా మనసు, శరీరం అతడి కోసం ఎందుకు అంతగా తపిస్తుందో నాకు అర్థం కావడంలేదు...
 
పరాయి పురుషులు, స్త్రీలతో పరిచయాలు తొలుత చాలా తీయగా అనిపిస్తాయి. ఒక్కసారి ఆ ఊబిలో దిగితే బయటకు రావడం కష్టతరంగా మారుతుంది. నాలుగు తీయటి మాటలు చెప్పి, ముద్దు పెట్టగానే అది కొత్త అనుభూతిగా భావించి అతడు లేనిదే ఉండలేని స్థాయికి వెళ్లిపోయారు. పరాయి పురుషుడు కనుక అది కొత్తగానే ఉంటుంది. ఐతే అది మరికాస్త ముందుకు వెళితే అగాధం అవుతుంది. వివాహేతర సంబంధాలు చిక్కులను తెస్తాయి తప్పించి సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వవని గ్రహించండి. వెంటనే అతడికి దూరంగా ఉండండి. వీలుకాకపోతే కొన్నాళ్లు మీ బంధువుల ఇంటికి వెళ్లడమో లేదంటే భర్తతో కలిసి ఏదైనా విహార యాత్రకు వెళ్లడమో చేయండి.