శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: సోమవారం, 21 డిశెంబరు 2015 (17:43 IST)

ఎనిమిదేళ్ల కిందట ఆమెతో పాల్గొన్నా... నా భార్యతో శృంగారంలో పాల్గొనవచ్చా...?

నాకిప్పుడు 43 సంవత్సరాలు. నాకు ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువ. అప్పుడప్పుడు రక్త పరీక్ష చేయించుకుంటూ ఉంటా. ఇటీవల రక్తపరీక్షలో హెపటైటిస్-సి ఉన్నట్లు తేలింది. మందులు రాయాలని డాక్టరును అడిగితే దీనికి మందేమీ లేదని చెప్పారు. నాకిలాంటి సమస్య ఉందని చెప్పిన దగ్గర్నుంచి నాకు చిన్న ఇంజెక్షన్ ఇవ్వాలన్నా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నేను వాళ్లకు చెప్పలేదు కానీ ఎనిమిదేళ్ల కిందట ఒక్కసారి వేశ్యతో కలిశాను. అదేమైనా సమస్య తెచ్చి పెట్టిందేమోనని భయంగా ఉంది. అసలు హెపటైటిస్ వల్ల ప్రాణానికి ముప్పు ఉందా...? కొందరు సెక్సులో పాల్గొనరాదని అంటున్నారు. భార్యతో సెక్సులో పాల్గొంటే ఏమైనా అవుతుందా...?
 
హెపటైటిస్-సి అనేది రక్తమార్పిడి వల్లగానీ, సంభోగించడం వల్లగానీ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. కాబట్టి అలా వచ్చి ఉంటుందని అనుకోవచ్చు. డాక్టరుకు చెప్పకపోయినా పరీక్ష చేస్తే వారికి విషయం తెలిసిపోతుంది. ఇది ఒకసారంటూ వచ్చాక ఎప్పటికీ శరీరంలోనే ఉండిపోతుంది. రోగనిరోధకశక్తి తగ్గినప్పుడు ఈ హెపటైటిస్-సి వైరస్‌ పచ్చకామెర్లు వచ్చేలా చేస్తుంది. కొంతమందిలో హెపటైటిస్-సి అన్నది పదేళ్లు దాటాక కూడా దీర్ఘకాలికంగా కాలేయంలో ఉండి సిర్రోసిస్‌ను కలగజేస్తుంది. హెపటైటిస్-సిను ప్రమాదకరమైన వైరస్‌గా చెప్తారు. హెపటైటిస్-సి మీ శరీరంలోకి ప్రవేశించిందంటున్నారు కాబట్టి దాన్ని నియంత్రించేందుకు గ్యాస్ట్రో ఎంటరాలజిస్టును సంప్రదించండి. అలాగే మీ భార్యకు కూడా హెపటైటిస్-సి పరీక్ష చేయించి ఒకవేళ ఆమెకు ఆ సమస్య లేకున్నా ముందుజాగ్రత్తగా వ్యాక్సిన్ వేయించండి. వ్యాక్సిన్ కోర్సు పూర్తయ్యేవరకూ శృంగార సమయంలో కండోమ్ ధరించి పాల్గొనాలి.