శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (19:58 IST)

సెక్స్ చేస్తుంటే కాలితో తన్నుతుంది... వీర్యం స్ఖలిస్తే బూతులు తిడుతోంది... ఏం చేయాలి...?

నేను ఇంటర్ వరకే చదివాను. నేను పెళ్లాడిన అమ్మాయి ఐదో తరగతి. మా ఇద్దరికి పెళ్లయి 6 నెలలు దాటింది. అప్పటి నుంచి నేను ఓ సమస్యను ఎదుర్కొంటున్నాను. దాన్ని ఎవరికైనా చెప్పాలంటే సిగ్గుతో చచ్చిపోతున్నాను. అందుకే ఇక్కడ చెప్తున్నాను. అంగ ప్రవేశం చేసిన దగ్గర్నుంచి నా భార్య నన్ను బూతులు తిడుతుంది. 
 
వీర్యం స్ఖలించిన వెంటనే ఆలస్యం చేయకుండా నన్ను తోసేసి తన కాలితో తన్నుతుంది. మీదపడి నానా రచ్చ చేస్తుంది. ఆమె పరిస్థితి చూసి నాకు నవ్వు రావడమే కాదు భయం కూడా వేస్తుంది. ఒక్కోసారి చేతికి ఏదైనా దొరికితే దాన్ని తీసుకుని మీద వేస్తానని భయపెడుతుంది. ఐతే సెక్స్ చేయకముందు నాతో ఎంతో ప్రేమగా మాట్లాడుతుంది. సెక్స్ చేసేటపుడు మాత్రమే ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో అర్థం కావడంలేదు...
 
సెక్స్ సమయంలో ఆమె పట్ల మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుపలేదు. మొరటుగా ప్రవర్తిస్తే ఇలాంటి ఫలితమే వస్తుంది. పైగా ఆమెకు సెక్స్ పట్ల ఏమైనా అపోహలు ఉన్నాయేమో తెలుసుకోకుండా సెక్సు చేసేందుకు ఉపక్రమించినా ఇలాంటి ప్రవర్తన కొందరిలో కనబడుతుంది. ముందుగా ఆమెతో సెక్స్ చేయాలన్న ఆత్రుతను వదిలి ఆమె మనసులో రతి పట్ల ఉన్న అపోహలు ఏమిటో కనుగొనండి. అప్పటికీ ఆమె మారనట్లయితే నిపుణులైన సెక్సాలజిస్టు వద్ద ఇద్దరూ సమస్యను చెప్పి సమస్య నుంచి బయటపడండి.