శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: గురువారం, 11 సెప్టెంబరు 2014 (18:57 IST)

2సార్లు సెక్స్ చేస్తే 2సార్లు శీఘ్ర స్ఖలనమైంది... ఇక నీవల్లేం తేలుతుందంటోంది...

నా వయసు 26 ఏళ్లు. ప్రేమించిన అమ్మాయితో పెళ్లి నిశ్చితార్థమైంది. ఐతే పెళ్లికి ముందే సెక్స్ అనుభవం కావాలని నేనే గొడవ చేస్తే ఆమె సరేనంది. రెండుసార్లు సెక్సుకు సిద్ధమైనప్పుడు అంగం బాగా స్తంభించింది. ఐతే అంగ ప్రవేశం చేసాక రెండు నిమిషాల్లోనే వీర్యం స్ఖలనమైపోయింది. మూడోసారి చేయబోతే అదే అనుభవం ఎదురవుతుందని ఆమెను ఒత్తిడి చేయలేదు. ఇక అప్పట్నుంచి శీఘ్ర స్ఖలనం సమస్య గురించి వైద్యుని వద్ద చూపించుకోమంటుంది. లేకపోతే పెళ్లయ్యాక నీవల్లేం తేలదని అంటోంది. ఇక అప్పట్నుంచి నాకు భయం పట్టుకుంది. నిజంగా నేను సెక్సులో సమర్థవంతంగా పాల్గొనలేనా...?
 
సెక్సులో పాల్గొన్నప్పుడు ఇద్దరికీ తృప్తి కలిగేవరకూ పురుషాంగం నిలిచి ఉండకుండా ముందే స్ఖలనమైపోవడాన్ని శీఘ్ర స్ఖలనమని అంటారు. మానవుల విషయానికి వచ్చేసరికి సెక్సులో పురుషుడి పాత్ర చాలా కీలకం. ఎందుకంటే స్త్రీతో సెక్స్ చేసేటపుడు అంగప్రవేశం చేయాలంటే అంగం బాగా గట్టిపడి స్తంభించి అది ఎక్కువసేపు అలా నిలిచి ఉండాలి. అలా కాకపోతే స్త్రీకి చాలా అసంతృప్తి కలుగుతుంది. అందువల్ల శీఘ్రస్ఖలనం కాకుండా ఉండేందుకు స్టాప్ట్-స్టార్ట్ టెక్నిక్ ద్వారా ముందుకు వెళ్లాలి. 
 
సెక్స్ పరంగా తీవ్ర ఉత్తేజం కలిగినపుడు సెక్స్ చేయడాన్ని ఆపివేయాలి. అపుడది మామూలు స్థితికి వచ్చేస్తుంది. కొద్దిసేపటి తర్వాత మళ్లీ సెక్స్ ప్రారంభించాలి. ఇలా చేయడం ద్వారా వీర్యం స్ఖలించడంలో సమయం ఎక్కువ తీసుకుంటుంది. ఐతే మీ విషయంలో పెళ్లికి ముందే సెక్సులో పాల్గొనడంవల్ల తెలీన ఆందోళన కారణంగా శీఘ్రస్ఖలనం సమస్య తలెత్తవచ్చు. కాబట్టి దాని గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు.