శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శనివారం, 25 అక్టోబరు 2014 (13:38 IST)

అంగ ప్రవేశం దుర్లభమవుతోంది... యోని చాలా బిగుతుగా ఉంది ఎలా...?

నా భార్యకు 32 ఏళ్లు. 6 నెలల క్రితం పెళ్లి చేసుకున్నాను. అప్పటి నుంచి సెక్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాను. కానీ నా వల్ల కావడంలేదు. ఆమె యోని చాలా బిగుతుగా ఉంది. కేవై జెల్లీ రాసినా వదలుకావడంలేదు. అంగప్రవేశం చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తే నొప్పి అని ఏడుస్తోంది. ఏం చేయాలి..?
 
కొందరి యువతుల్లో సెక్స్ అంటేనే అదో భయంకరమైన అనుభవం అనీ, కన్నెపొర చిరిగిపోయి రక్తస్రావమవుతుందనీ, ఇలా రకరకాల అనుమానాలు, అపోహలు ఉంటాయి. దాంతో సెక్స్ సమయంలో భయంతో బిగుసుకుపోతారు. ఫలితంగా యోని వద్ద కండరాలు మరింత బిగుతుగా మారిపోతాయి. 
 
దీంతో అంగ ప్రవేశం దుర్లభమవుతుంది. అందువల్ల సెక్సుకు ముందు ఫోర్ ప్లేతో ఆమెను సమాయత్తపరచాలి. అంగ ప్రవేశం మీ వైపు నుంచి కాక ఆమె వైపు నుంచి జరిగేలా ప్రయత్నించండి. సులభంగా అంగప్రవేశం జరిగిపోతుంది.