శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: గురువారం, 11 సెప్టెంబరు 2014 (18:24 IST)

కాబోయే భర్త దృఢకాయుడు.... అతడు అంగ ప్రవేశం చేస్తే....

మా దూరపు బంధువుల అబ్బాయి. వాళ్లూరులో అతడిని వస్తాద్ అంటుంటారు. ఎందుకంటే అతడికి ఫిట్ నెస్ పై శ్రద్ధ ఎక్కువ. మంచి కండలు తిరిగి ఉంటాడు. అతడితో పెళ్లి కుదిరింది. అతడిని చూసిన నా స్నేహితులు తొలిరేయినాడు ఎలా భరిస్తావో అంటున్నారు. అతడి పురుషాంగం కూడా దృఢంగా ఉంటుందనీ, చాలా బాధగా ఉంటుందని అంటున్నారు. అంగ ప్రవేశం చేసేటపుడు రక్తం కారుతుందంటూ భయపెడుతున్నారు. నిజంగా అలా జరుగుతుందా...?
 
మీ స్నేహితులది, మీది కూడా అర్థం లేని భయం. పురుషుడి పురుషాంగం స్తంభించినపుడు 4 నుంచి 6  అంగుళాల మేర ఉంటుంది. పురుషుడు కండలు తిరిగి బలిష్టంగా ఉన్నాడని పురుషాంగం కూడా అలా ఉంటుందని అనుకోవడం అపోహ. అదేమీ కాదు. తొలిరేయి నాడు ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకోవాలి. కలయిక కోసం శరీరాలు తపిస్తున్నప్పుడు సెక్సుకు ఉపక్రమించాలి. ఆ సమయంలో లూబ్రికెంట్స్ వాడటం వల్ల ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అంగ ప్రవేశం సులభంగా జరిగిపోతుంది.