శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : మంగళవారం, 24 మార్చి 2015 (14:41 IST)

ఇద్దరు పిల్లలు... నా భార్య మూడ్ లేదని సతాయిస్తోంది.. ఏం చేయాలి?

నాకు వివాహమై ఆరేళ్లు అయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. సిజేరియన్ చేయించాను. అయితే, ఇటీవలి కాలంలో నా భార్య శృంగారంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఏంటని అడిగితే నాకు మూడ్ లేదని సతాయిస్తోంది. దీంతో నేను కూడా ఆమెను బలవంతం చేయడం లేదు. కానీ, ఇదే పరిస్థితి రెండు నెలలుగా సాగుతోంది. దీంతో నాకు చిర్రెత్తుకొస్తోంది. మరోవైపు నాకు కోర్కెలు ఎక్కువ. పరాయి స్త్రీల వద్దకు వెళ్లడం ఇష్టం లేదు. ఇపుడు నా భార్యకు మూడ్ తెప్పించి నా కోర్కెలను తీర్చుకోవడమెలా. సలహా ఇవ్వండి. 
 
చాలా మంది గృహిణులు ఇదేవిధంగా ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా పిల్లలు పుట్టాక వారిలో ఈ మార్పు కనిపిస్తుంది. భర్తకు మూడ్ ఉండి రోజులో ఎప్పుడైనా సెక్స్ చేద్దామని ప్రయత్నిస్తే వారికి అవకాశం ఇవ్వక పోగా, చిరాకు తెప్పిస్తారు. దీంతో భర్త చిరాకు పరాకు పడుతాడు. అలా భర్తలు చిరాకు పడకుండా భార్యను ముగ్గులోకి దించడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే మన దార్లోకి వస్తారని అంటున్నారు నిపుణులు. ఆవేంటో ఓసారి చూద్దాం. 
 
భార్య ఒంటరిగా ఉన్న సమయంలో వెనుక నుంచి వెళ్ళి గట్టిగా కౌగిలించుకుని మెడ భాగంలో ఓ ముద్దుల వర్షం కురిపిస్తే ఇట్టే కరిగిపోతారట. అలాగే భార్యా వంటగదిలో ఉన్న సమయంలో శబ్ధం చేయకుండా వెళ్లి వెనుక నుంచి చుట్టేయడం. ఆ సమయంలో మీకు అందుబాటులో ఉండే చాక్‌లెట్ లేదా ఐస్‌క్రీమ్ వస్తువులను నోట్లో పెట్టేసి.. మీరు కూడా వాటిని షేర్ చేసుకునేందుకు ప్రయత్నించాలి. కొన్ని సందర్భాలలో వారు చిరాకు పడ్డా మనం కూల్‌గా ఉండాలంటున్నారు. 
 
ఒకవేళ అది ఫలితం ఇవ్వకపోతే... బాత్‌రూమ్‌లోకి స్నానం చేస్తున్నట్టుగా వెళ్లి.. భార్యను పిలిచి లోపలికి లాగేయాలి. అక్కడ రోమాన్స్‌ ప్రారంభించాలి. అందులోనూ బాత్‌రూమ్ స్నానంతో ఎంతో మజానిస్తుందని సెక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రతిక్రీడ ఉత్తేజాన్ని ఇచ్చేటందుకు ముందస్తు ఫోర్‌ప్లేతో ఆరంభించాలి. ఎందుకంటే మహిళలు ముందుగా ఫోర్‌ప్లేలను ఎంతో ఇష్టపడతారట. అదేవిధంగా కంటి సైగలతో కూడా భార్యతో రొమాన్స్ మొదలు పెట్టవచ్చని నిపుణులు చెపుతున్నారు. భార్య దృష్టిలో పడటానికి కంటి సైగలతో రొమాన్స్ చేయవచ్చంటున్నారు. వాస్తవానికి మహిళలు మగవారిని ఆకర్షించేందుకు వీటిని బాగా ఉపయోగిస్తారట.