శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : గురువారం, 6 నవంబరు 2014 (16:57 IST)

మూడొచ్చింది... ముద్దుపెట్టమంటే.. నా భార్య సతాయిస్తూ ఉంటుంది.. ఏం చేయాలి?

మాది విజయనగరం. వివాహమై పదేళ్లు అయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిజానికి నాకు కోర్కెలు అధికం. దీంతో నా భార్యతోనే కాకుండా, చెడు తిరుగుళ్లు కూడా తిరుగుతుంటాను. దీనికి కారణం లేకపోలేదు. నాకు మూడొచ్చినపుడు నా భార్యను పిలిస్తే రాదు. కనీసం ముద్దుపెట్టమన్నా పెట్టదు. దీంతో పక్కదారి పట్టాను. నా భార్య వైఖరిని ఏ విధంగా మార్చాలి. గట్టిగా ఒత్తిడి చేస్తే పిల్లలు ఉన్నారు ఎలా అంటూ మారాం చేస్తోంది. రాత్రి పూట రమ్మంటే.. పిల్లలు నిద్రలేస్తారని అడ్డు చెపుతోంది. ఏం చేయాలి. 
 
సాధారణంగా అనేక మంది దంపతులకు పిల్లలు పుట్టిన తర్వాత సెక్స్ పట్ల వ్యామోహం తగ్గుతుంది. ముఖ్యంగా సహజ ప్రసవం ద్వారా తల్లులైన భార్యలతో భర్తలు సెక్స్ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. ఇందుకు కారణం లేకపోలేదు. యోని మార్గం లూజుగా ఉందని సతాయిస్తూ భార్యతో సెక్స్‌లో పాల్గొనేందుకు మొహం చాటేస్తూ.. పొరుగింటి పుల్లకూర కోసం అర్రులు చాస్తుంటారు. ఇలాంటి పరిస్థితే మీకు ఎదురవుతున్నట్టుగా ఉంది. 
 
వాస్తవానికి సెక్స్‌ సమయంలో స్త్రీపురుషులిద్దరిలో వెజైనల్‌ ద్వారాలు, ప్రీ వెజుక్యులేటరీ సీక్రెషన్స్‌ ఉద్రేకం వల్ల వెజైనాలోని పురుషాంగం మీద స్రవిస్తాయని చెపుతున్నారు. దీంతో యోనిలో అంగ ఉన్నపుడు లూజుగా అనిపిస్తుందని, అలాంటి సమయంలో సెక్స్‌ ప్రక్రియ మధ్యలో ఆపి ఉతికిన నేత గుడ్డతో ఆ ద్రవాన్ని తుడుచుకోవాలంటున్నారు. అలాగే, పురుషుడు ఫోర్‌ప్లేల ద్వారా భార్యను సంతృప్తి పరిచేలా చేయాలని కోరుతున్నారు. 
 
అలాగే కొన్నిరకాల బ్రీథింగ్‌ ఎక్సర్‌సైజులు, పీసీఎమ్‌ ఎక్సర్‌సైజులు వల్ల కూడా వెజైనల్‌ ద్వారం టైట్‌ అయ్యే అవకాశం ఉంటుందని చెపుతున్నారు. ముఖ్యంగా.. పురుషుడు తమ భార్యను సతాయించడం మాని సెక్స్‌లో ఆమెకు పూర్తిగా సహకరించేలా నడుచుకోవాలని సలహా ఇస్తున్నారు. స్త్రీలలోనే కాక పురుషులలో కూడా అంగస్తంభనం, శీఘ్రస్కలనం, భార్యతో ఫోర్‌ప్లే చేయకుండా శృంగారంలో దిగి అసంతృప్తికి లోనుకావడం వంటి సమస్యలు 99 శాతం ఉంటున్నాయని గుర్తు చేస్తున్నారు. 
 
అందువల్ల శృంగారంలో పాల్గొనే భార్యాభర్తలు చిన్నపాటి టెక్నిక్స్ పాటిస్తే వారి శృంగార జీవితం సుఖమయమవుతుందని ఘంటాపథంగా చెపుతున్నారు. ఈ టెక్నిక్స్ పాటించేందుకు దంపతులు ఏమాత్రం ఫీల్ కాకూడదని, అలాగే, భావప్రాప్తి పొందినట్టుగా భార్యలు నటించకూడదని, చెపుతున్నారు. ఇలాంటి పద్దతుల ద్వారా సెక్స్‌లో సంతృప్తి లభించనట్టయితే నిపుణుడైన సెక్సాలజిస్టును సంప్రదించి తమ సమస్యకు పరిష్కార మార్గం కనుగొనాలని వారు సలహా ఇస్తున్నారు.