శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : మంగళవారం, 20 జనవరి 2015 (15:44 IST)

నా భార్య నాకంటే పదేళ్లు చిన్నది.. ఆమెను సంతృప్తి పరచలేక పోతున్నా ఏం చేయాలి!

ఆర్నెల్ల క్రితం నాకు వివాహమైంది. నా భార్య నా కంటే పదేళ్ళు చిన్నది. దీంతో ఆమెను శారీరకంగా సంతృప్తి పరచలేకపోతున్నాననే ఫీలింగ్ నాలో ఏర్పడింది. అయితే, ఆమె వైపు నుంచి మాత్రం ఎలాంటి స్పందన రావడం లేదు. కానీ, నా వల్ల తృప్తి పొందుతుందా లేదా అనే విషయం తెలియడం లేదు. ఏం చేయాలి. సలహా ఇవ్వండి. ప్లీజ్. 
 
దాంపత్య జీవితంలో వయస్సుతో నిమిత్తం లేదు. దాంపత్య జీవితాన్ని కొనసాగించే స్త్రీపురుషుల్లో మనస్సులో శృంగార కోర్కెలు ఉన్నట్టయితే చాలు. వివాహం చేసుకునే యువతీ యువకుల మధ్య వయస్సు వ్యత్యాసం పదేళ్లు అనేది పెద్ద తేడా కాదు. పైగా.. ఆమె వైపు నుంచి అసంతృప్తి అనేది  కనిపించనపుడు ఆమె ఖచ్చితంగా మీ నుంచి దాంపత్య తృప్తి పొందుతున్నట్టే. అందువల్ల ఈ విషయం గురించి పదేపదే ఆలోచన చేయొద్దు. భార్యతో ఎక్కువ సమయం గడపండి. ముఖ్యంగా ఉపరతికి అధిక ప్రాధాన్యతనిస్తూ.. ముద్దులు, కౌగలింతలు, చక్కిలిగింతలతో ఉక్కిరిబిక్కిరి చేయడం ద్వారా  బాహ్యరతిలోనే భావప్రాప్తి పొందేలా చేయవచ్చు. ఆ తర్వాత సెక్స్‌లో పాల్గొనట్టయితే భార్యాభర్తలిద్దరూ పూర్తి సంతృప్తి చెందుతారు.