శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : సోమవారం, 23 మార్చి 2015 (16:23 IST)

అతిగా మద్యం సేవిస్తాను.. సెక్స్‌లో భార్యను సంతృప్తిపరచగలనా?

నా వయస్సు 26 యేళ్లు. త్వరలో వివాహం చేసుకోబోతున్నా. అయితే, నాకు డిగ్రీ చదివే రోజుల్లో మద్యం అలవాటు అయింది. ఆ తర్వాత మద్యానికి బానిసనయ్యాను. అయితే, నా ప్రశ్న ఏంటంటే.. మద్యం అలవాటు ఉన్న పురుషులు పడక గదిలో భార్యను సంతృప్తి పరచగలరా? ఎందుకంటే.. తాగుడు అలవాటు ఉన్న భర్తలు తమ భార్యలను శారీరకంగా సంతృప్తి పరచలేరని విన్నాను. చాలా మంది నా స్నేహితులు కూడా చెప్పారు. రేపు నా పరిస్థితి కూడా ఇలానే ఉంటుందా. ఏం చేయాలి.
 
మద్యం అలవాటు ఉన్న స్త్రీపురుషులిద్దరూ దాంపత్య సుఖాన్ని సంతృప్తిగా అనుభవించలేరు. మద్యం సేవించే అలవాటు ఉన్న వారు ఎక్కువగా కాలేయ సమస్యలతో తీవ్రంగా బాధపడుతారు. కాలేయం దెబ్బతిన్నట్టయితే శరీరం మొత్తం స్థిరత్వాన్ని కోల్పోయి.. హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రించలేదు. అదే పురుషుల్లో అయితే, టెస్టిక్యులర్ అట్రోఫీ, నపుంసకత్వం, స్టెరిలిటీ వంటి సమస్యలకు దారితీస్తుంది. అలాగే, మహిళలు మద్యం సేవించే అలవాటు ఉన్నట్టయితే, వారి గర్భాశయంతో పాటు రుతుచక్రంపై తీవ్ర ప్రభావం చూపి సెక్స్ జీవితంలో మార్పులకు గురి చేస్తుంది. 
 
నిజానికి మద్యం సేవించడం వల్ల సెక్స్ కోర్కెలు పెరిగినప్పటికీ.. సెక్స్ సామర్థ్యం శక్తిని తగ్గిస్తుంది. అయితే, అతి తక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకున్నట్టయితే, ఇది సెక్స్ జీవితానికి మేలు చేస్తుందని వైద్యులు చెపుతున్నారు. సుదీర్ఘకాలంగా అతి తాగుడు అలవాటు ఉన్నట్టయితే అది శరీరానికి మాత్రమే కాకుండా, సెక్స్ జీవితానికి కూడా తీవ్ర హాని చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల మద్యానికి దూరంగా ఉంటూ సంసార జీవితాన్ని అనుభవించేందుకు ప్రయత్నించండి.