శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: ఆదివారం, 5 ఏప్రియల్ 2015 (14:28 IST)

పక్కింటి అమ్మాయి చాలా అందంగా ఉంటుంది... సెక్స్ ప్రపోజ్ చేయాలంటే సిగ్గేస్తుంది...

మా ఇంటి పక్కనే ఉండే అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. ఆమెతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను. నా వయసు 20 ఏళ్లు. ఆమె వయసు 22 ఏళ్లు. ఆమెను చూస్తే నా అంగం స్తంభిస్తుంది. ఆమెతో సెక్స్ చేసినట్లు ఈమధ్య ఊహలు ఎక్కువవుతున్నాయి. నాకు ఆమెతో సెక్సులో పాల్గొనాలని ఎంతో ఆశగా ఉంది. కానీ నేను దీని గురించి ప్రపోజ్ చేస్తే ఆమె ఏమంటుందోనని భయంగా కూడా ఉంది. ఐతే నేను బక్కగా పీలగా ఉంటాను.
 


ముందుగా మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోండి. ఉదయాన్నే లేచి జిమ్ కు వెళ్లండి. డంబెల్స్ చేయండి. మంచి ఫిజిక్ ను సాధించండి. 20 ఏళ్లు అంటున్నారు కాబట్టి మీ చదువు కూడా పూర్తి కాలేదు. ముందుగా కెరీర్ గురించి శ్రద్ధ తీసుకోండి. ఫిజిక్, కెరీర్ గురించి ఆలోచించండి. పొరుగింటి అమ్మాయి మాట్లాడుతున్నంత మాత్రాన ఆమెతో సెక్స్ చేయాలని అనుకోవడం ఆమె పట్ల మీకున్న ఆకర్షణ అని గుర్తించండి. సెక్స్ కంటే ముందు మీరు అన్నివిధాలా స్థిరపడ్డాక ఆ అమ్మాయినే మీరు ఇష్టపడితే పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసుకోండి.