పడక గదిలో ప్రయోగాలు ఇబ్బందిగా ఉన్నాయి... ఏం చేయాలి?
అనేక మంది దంపతులు తమ దాంపత్య జీవితాన్ని తమకు తోచినవిధంగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇలా ఎంజాయ్ చేయడాన్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడకపోవచ్చు. ముఖ్యంగా చాలామంది మహిళలు పడక గదిలో విచ్చలవిడిగా శృంగారానికి అంగీకరించరు.
అనేక మంది దంపతులు తమ దాంపత్య జీవితాన్ని తమకు తోచినవిధంగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇలా ఎంజాయ్ చేయడాన్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడకపోవచ్చు. ముఖ్యంగా చాలామంది మహిళలు పడక గదిలో విచ్చలవిడిగా శృంగారానికి అంగీకరించరు. కానీ, భర్త మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తమ కోర్కె తీర్చుకునేందుకు వివిధ రకాల ప్రయోగాలు చేస్తూ మొరటుగా ప్రవర్తిస్తుంటారు. ఈ ప్రయోగాలు తీవ్ర ఇబ్బందికి గురిచేస్తుంటాయి. ఇలాంటి పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావడం లేదు.
చాలామంది పురుషులు ఎదుటివారి మనస్తత్వాన్ని అర్థం చేసుకోకుండా పడక గదిలో మొరటుగా ప్రవర్తిస్తుంటారు. ఈ మొరటు ప్రవర్తన అసౌకర్యం కలిగిస్తుంటే ఆ విషయాన్ని కూడా తెలియజేయడం మంచిది. పడక గదిలో ఎలా ఉంటే ఇష్టమో, ఎలాంటి చర్యలు ఆనందం కలిగిస్తాయో స్పష్టంగా చెప్పాలి. అలాగే మీకు నొప్పి కలగని శృంగార భంగిమ గురించి వివరించిండి. ఆ భంగిమలోనే శారీరకంగా కలుసుకునేందుకు ఆసక్తి చూపించండి.
పైగా, ఇద్దరూ ఒకరికొకరు కంఫర్టబుల్‌గా తయారయ్యాక నెమ్మదిగా వేర్వేరు శృంగార భంగిమల్లో ప్రయోగాల గురించి ఓపెన్‌గా డిస్కస్ చేసుకోండి. పైగా, ఇలాంటి విషయాలు చాలా సున్నితమైనవి కావడం వల్ల భార్యాభర్తలిద్దరూ పడక గదిలో మనసు విప్పి మాట్లాడుకోవడం చాలా మంచిది. ఒకవేళ అందులో ఇబ్బంది ఉంటే ఆలస్యం చేయకుండా సంబంధిత విభాగం వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.