శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : మంగళవారం, 17 ఫిబ్రవరి 2015 (15:17 IST)

నా భార్యకు గర్భ సంచి తీసేశారు... సెక్స్ చేయొచ్చా?

ఇటీవల నా భార్యకు గర్భ సంచిలో ఏదో లోపం వల్ల ఇటీవలే పెద్దాపరేషన్ చేసి తీసేశారు. ఇపుడు సెక్స్ చేయవచ్చా. సలహా ఇవ్వండి. సాధారణంగా మహిళలకు గర్భ సంచుల్లో సమస్యలు వస్తుంటాయి. ఒక్కో సందర్భంలో వీటిని పెద్దాపరేషన్ ద్వారా తొలగిస్తుంటారు. ఇలాంటి వారు దాంపత్య సుఖానికి పనికి వస్తారా.. అసలు సెక్స్‌లో పాల్గొన వచ్చా అనే సందేహం కలగడం సహజమే. అయితే, సెక్స్‌లో పాల్గొనడమా లేదా అనే అంశంపై వైద్య నిపుణులను సంప్రదిస్తే... 
 
సాధారణంగా గర్భసంచి తీసేసిన తర్వాత రెండు నెలల నుంచి లైంగికంగా కలుసుకోవచ్చని చెపుతున్నారు. ఈ ఆపరేషన్‌ జరిగిన తర్వాత కొంత మంది స్త్రీలు నొప్పిగా ఉందంటూ బిగుసుకుపోతారు. కారణం ఆపరేషన్‌ జరిగిన తర్వాత యోని మార్గం కాస్త టైట్‌గా, చిన్నదిగా మారడమేనని చెపుతున్నారు. 
 
గర్భాశయం తీసివేయడం వల్ల యోని మార్గం లోతు తగ్గినట్లు అన్పించినా తర్వాత అంతా సర్దుకుని పోతుందని చెపుతున్నారు. ఆపరేషన్‌ జరిగిన తర్వాత టైట్‌గా అనిపించినప్పుడు వేజిలైన్‌ లేదా నూనె ఉపయోగించడంలో తప్పు లేదని వైద్యులు సలహా ఇస్తున్నారు.