శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Updated : ఆదివారం, 14 అక్టోబరు 2018 (17:07 IST)

చిరునామా సరిగా రాయని పోస్టు కార్డులా ఇంకేదో చోటికివెళితే...

ఓ జంటకు వివాహం ఘనంగా జరిగింది. తొలిరాత్రి శోభనం బాగానే ముగుస్తుంది. హనీమూన్ అంతా సాఫీగా సాగిపోతుంది. అత్తారింట్లో తొలి పండగ చేసుకుంటారు. అలా తొలి పెళ్లి వార్షికోత్సవాన్ని జరుపుకుంటారు. ఆ ముహూర్తానికే పెళ్లయిన దంపతులు అమ్మానాన్నలు అనిపించుకోవాలని తహతహలాడుతారు. కానీ, పెళ్లయి ఒక యేడాది గడిచిపోయినా భార్య గర్భందాల్చదు.
 
దీనికి కారణాలు లేకపోలేదు. వీర్యంలో నాణ్యత లోపించడం, లైంగిక వ్యవస్థలో లోపాలు, సరైన పద్ధతిలో సెక్స్‌ చేయకపోవడం, జననేంద్రియంలో లోపాలు వంటివి ప్రధానంగా చెప్పుకోవచ్చు. వీటిలో అతి ముఖ్యమైనది వీర్యం. పురుషుడిలో ఉత్పత్తి అయ్యే ప్రతి మిల్లీ లీటరు వీర్యంలో కనీసం 20 మిలియన్ల వీర్య కణాలు ఉండాలి. అందులో యాభైశాతం కణాలు చురుగ్గా కదులుతూ ఉండాలి. ముప్పైశాతం కణాలు నిర్మాణపరంగా ఆరోగ్యవంతమైనవి అయి ఉండాలి. అప్పుడే, లైంగిక భాగస్వామి గర్భం దాలుస్తుంది. 
 
పుట్టుకతోనే వచ్చిన లోపాలవల్ల కానీ, ప్రమాదాల్లోనో ఇన్ఫెక్షన్ల మూలంగానో వృషణాలు దెబ్బ తినడం వల్ల కానీ... ఆ ప్రభావం వీర్యం మీద పడుతుంది. 'హైపోస్పడియాస్'... పురుషాంగ ద్వారం ఉండాల్సిన చోట ఉండకపోవడం, పురుషాంగం వంగిపోయి ఉండటం... తదితర కారణాల వల్ల వీర్యం గమ్యాన్ని చేరుకోలేదు. చిరునామా సరిగా రాయని పోస్టుకార్డులా ఇంకేదో చోటికి వెళ్లిపోతుంది. అలాంటప్పుడు గర్భం దాల్చడం అసాధ్యని వైద్యులు చెబుతున్నారు.