శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : బుధవారం, 29 అక్టోబరు 2014 (18:44 IST)

ఏడేళ్లుగా సెక్స్ సుఖం లేదు.. ఒళ్లు వేడెక్కి ఇబ్బంది పెడుతోంది.. ఏం చేయాలి?

మాది వైజాగ్. నాకు 18వ యేటనే వివాహం చేశారు. ఐదారేళ్ళపాటు బాగానే సంసార జీవితం సాగింది. ఒక రోజున నా జీవితంలో రోడ్డు ప్రమాదం మరచిపోలేని గాయాన్ని ఏర్పరచింది. ఆ ప్రమాదంలో నా భర్తకు శరీరమంతా చచ్చుబడిపోయింది. అప్పటి నుంచి ఆయన మంచానికే పరిమితమయ్యారు. దీంతో ఏడేళ్లుగా సెక్స్ సుఖానికి దూరమయ్యాను. ఫలితంగా ఒళ్ళు వేడెక్కి తెగ ఇబ్బంది పెడుతోంది. ఏం చేయాలి. ఎవరితోనైనా సంబంధం పెట్టుకోవచ్చా? 
 
నిజంగా మిమ్మలను అభినందించాలి. కొన్నేళ్ళుగా మంచంలో ఉన్న మీ భర్తకు సపర్యలు చేస్తున్నారంటే హ్యాట్సాఫ్ చెప్పాలి. మంచాన పడిన భర్తను చూసుకోవడానికి ఎంత సహనం, ఓర్పు, శక్తి అవసరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 
 
అయితే, మీరున్న పరిస్థితులను బట్టి చూస్తే మీ భర్త ద్వారా మీకు దాంపత్య సుఖం పొందడం అనేది దైవ నిర్ణయంపై ఆధారపడివుంటుంది. తిరిగి ఆయన కోలుకుంటేనే ఆయన ద్వారా మీకు రతితృప్తి దక్కుంది. ప్రస్తుతం మీరున్న పరిస్థితుల్లో మీ కోర్కెలను తీర్చుకోవడానికి మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంటారా లేదా అనేది మీ వ్యక్తిగత నిర్ణయం. 
 
ఇందులో ఏ ఒక్కరూ సలహాలు ఇవ్వజాలరు. ఒకవైపు శరీర కోర్కెలు.. మరోవైపు.. భర్తపై ఉన్న ప్రేమానురాగాలు. వీటి మధ్య మీ సంఘర్షణ కొనసాగుతోంది. వీటిలో ఏది గెలుస్తుందో మీకు కాలమే సమాధానం చెప్పాలి.