శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : శుక్రవారం, 12 డిశెంబరు 2014 (16:03 IST)

చనుమొనల మీద వేళ్ళతో నిమురుతుంటే స్త్రీలకు ఎలాంటి ఆనందం కలుగుతుంది?

సాధారణంగా శృంగారంలో ఆడవారి చనుమొనల మీద వేళ్ళతో పురుషుడు నిమురుతుంటాడు. అలా నిమురుతుంటే పురుషులకు ఓ విధమైన అనుభూతి కలుగుతుంది. ఇదే తరహా చర్య వల్ల స్త్రీలకు కలిగే ఆనందమెలా ఉంటుంది? 
 
సాధారణంగా చనుమొనలను తాకితే ఆడవారిలో కోరికలు పెరుగుతాయని పురుషులు అనుకుంటారు. కానీ వాస్తవంగా అది 50 నుంచి 60 శాతమే. పురుషుల్లో ఆ ఆనందం చాలా తక్కువ. అయినా తమ చనుమొనలు తాకమని ఆడవారిని అడిగే మగవాళ్లూ లేకపోలేదు. 
 
ఎందుకంటే.. స్త్రీపురుషులిద్దరిలోనూ చనుమొనల నాడుల ద్వారా మెదడు, మర్మాంగాలకు సంబంధం కలిగి ఉంటుంది. అందుకే చనుమొనల మీద స్పర్శ మిగిలిన భాగాలను ఉత్తేజపరుస్తుంది. 
 
అయితే, ఇది అందరిలోనూ ఒకేలా ఉండదు. కొందరిలో కొన్ని భాగాల స్పందన అధికంగా ఉంటుంది. కొంతమంది స్త్రీలలో చనుమొనల స్పందన ఎంత తీవ్రంగా ఉంటుందంటే వాటిని నిమురుతున్నప్పడే వారు భావప్రాప్తి చేరుకుంటారు.