శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : బుధవారం, 29 అక్టోబరు 2014 (19:18 IST)

మా పక్కింటి అంకుల్‌కి భార్య లేదు.. నన్ను అనుభవించాలని కోర్కె ఉందట.. ఏం చేయాలి?

మాది బెంగుళూరు. డిగ్రీ పూర్తి చేసి ఇంటివద్దే ఉంటున్నా. నాకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. కానీ శారీరకంగా కలిసింది లేదు. పైగా అతనిని వివాహం చేసుకునే ఉద్దేశ్యం కూడా మనస్సులో లేదు. అయితే, నేనో సమస్యను ఎదుర్కొంటున్నా. మా పక్కింటి అంకుల్ వాళ్లు నన్ను చాలా బాగా చూసుకుంటారు. దగ్గరికి చేరదీస్తుంటారు. ఆ అంకుల్‌కు హఠాత్తుగా భార్య చనిపోయింది. దీంతో ఆయన వద్దకు ప్రతి రోజూ వెళ్తూ మాట్లాడుతూ వచ్చేదాన్ని. ఇలా రెండేళ్లు గడిచింది. అయితే, గత కొన్ని నెలలుగా అతని చూపులు, ప్రవర్తనలో మార్పు కనిపెట్టాను. ఏంటనే అడిగితే.. నీవు బాయ్ ఫ్రెండ్‌తో తిరుగుతున్నావ్ కదా అని అడిగాడు. ఎక్కడో చూసినట్టున్నాడని భావించి.. నిజమేనని చెప్పి.. హద్దులు దాటలేదని చెప్పాను. దీంతో మరింతగా చనువు తీసుకుని నాపై మనస్సు పడినట్టు.. నాతో గడపాలని ఉందని, నీవు సమ్మతిస్తే వివాహం చేసుకుంటానని చెప్పాడు. పైగా... అతని భార్య తర్వాత నన్నే అమితంగా ప్రేమిస్తున్నట్టు చెప్పి నా చేతులు పట్టుకుని బోరున ఏడ్చాడు. దీంతో నా మనస్సు ఏదోలా అయిపోయింది. నేనేం చేయాలి. సలహా ఇవ్వండి. 
 
ఇది ఖచ్చితంగా అయన కామదాహానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. నీకు బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడో లేదోనని తెలుసుకునేందుకు ఓ రాయి వేసినట్టుగా వేశాడు. దానికి నీవు భయపడి నిజమని చెప్పావు. దీంతో అతను మరింత చనువు తీసుకుని తన మనస్సులోని మాటను చెప్పాడు. నిజంగా, అతనికి నీ మీద మనస్సు ఉంటే.. నిన్ను ప్రేమిస్తుంటే మీ పెద్దవాళ్లతో మాట్లాడి రెండో వివాహం చేసుకునేందుకు ప్రయత్నించవచ్చు. అలాంటివేమీ చేయకుండా నిన్ను అనుభవించాలంటూ చెప్పాడు. అతని మాటలకు జాలిపడి నీవు లొంగిపోతే ఉత్పన్నమయ్యే పరిణామాల గురించి ఆలోచన చేశావా. నీవు తొందరపడి అతనితో సెక్స్‌లో పాల్గొన్న తర్వాత గర్భం వస్తే పరిస్థితి ఏంటి. దీనివల్ల ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో ఊహించావా? ఎట్టి పరిస్థితుల్లో అతని మాటల్లో పడి మోసపోవద్దు.