గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By selvi
Last Updated : శనివారం, 11 నవంబరు 2017 (10:37 IST)

నడుం నొప్పి వేధిస్తే ఇలా చేయండి..

గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చుంటున్నారా? నడుం నొప్పి వేధిస్తుందా? అయితే గోరువెచ్చటి నూనెతో నడుమూ, వెన్ను ప్రాంతాల్లో నెమ్మదిగా మర్దనా చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. ఇలా చేయ

గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చుంటున్నారా? నడుం నొప్పి వేధిస్తుందా? అయితే గోరువెచ్చటి నూనెతో  నడుమూ, వెన్ను ప్రాంతాల్లో నెమ్మదిగా మర్దనా చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల నొప్పితోపాటూ ఒత్తిడి కూడా తగ్గుతుంది.
 
నొప్పి తగ్గేవరకు ప్రతిరోజూ కొన్ని వారాలపాటు చేయాలి. సరైన పద్ధతిలో పడుకోకపోవడం వల్ల కూడా వెన్నునొప్పి బాధిస్తుంది. ఒకవేళ మీరు వెల్లకిలా పడుకోవాలనుకుంటే మీ మోకాళ్ల కింద తలగడను తప్పకుండా పెట్టుకోవాలి. ఒకవైపు తిరిగి పడుకోవాలనుకుంటే రెండు మోకాళ్లను మడిచి వాటి మధ్యలో తలగడను పెట్టుకోవాలి.   
 
వేడి నీటిలో వస్త్రాన్ని ముంచి కాపడం పెట్టుకోవడం వల్ల నడుం నొప్పి చాలామటుకూ అదుపులోకి వస్తుంది. కొన్ని ఐసు ముక్కలను లేదా చల్లటి కూరగాయల ప్యాకెట్‌ను ఒక తువాలులో చుట్టి దాంతో నడుంపై నెమ్మదిగా 15-20 సార్లు రుద్దినట్టు చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. చిన్నచిన్న వ్యాయామాలు కూడా నడుము నొప్పిని చాలామటుకూ అదుపులోకి తెస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.