సోమవారం, 27 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By selvi
Last Updated : శనివారం, 2 డిశెంబరు 2017 (12:34 IST)

పొట్ట తగ్గాలంటే సాల్మన్ చేపలు తినండి..

పొట్టతగ్గాలంటే సాల్మన్ చేపలు తినాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఈ చేపలను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా పొట్ట, ఊబకాయం వంటి సమస్యలు తగ్గిపోతాయి. విటమిన్ డి కి, ఊబకాయానికి, పొట్ట పెరగడానికి దగ్గర సంబంధం

పొట్టతగ్గాలంటే సాల్మన్ చేపలు తినాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఈ చేపలను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా పొట్ట, ఊబకాయం వంటి సమస్యలు తగ్గిపోతాయి. విటమిన్ డి కి, ఊబకాయానికి, పొట్ట పెరగడానికి దగ్గర సంబంధం ఉంటుందని, అందుకే ఈ చేపలను తినడం మంచిదని వారు అంటున్నారు. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా వుండటం ద్వారా పొట్టను ఇవి తగ్గిస్తాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు, వ్యాయామం లేకపోవడం ద్వారా పొట్ట, ఒబిసిటీ సమస్యలు ఉత్పన్నమవుతాయి.'
 
ఈ సమస్యల నుంచి తప్పుకోవాలంటే.. కోడిగుడ్డును రోజుకొకటి చొప్పున తీసుకోవాలి. కోడిగుడ్డు విటమిన్ డిని అందిస్తుంది. ఫ్యాట్ మెటబాలిజం ప్రక్రియలో కోడిగుడ్లు కీలక పాత్రను పోషిస్తాయి. అలాగే కీర దోసకాయను రోజుకొకటి తీసుకోవాలి. పొట్ట తగ్గాలంటే సోపు గింజలు తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్‌ను వంటల్లో చేర్చుకోవడం.. తృణ ధాన్యాలను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా బరువు తగ్గొచ్చునని వైద్యులు సూచిస్తున్నారు.