శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 జూన్ 2016 (11:58 IST)

ఫాట్ తగ్గాలా? కాలేయ ఆరోగ్యానికి క్యారెట్ తినండి

చర్మం నిగనిగలాడాలా? అయితే రోజూ ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తీసుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేకాదు.. శరీరంలోని కొవ్వును తగ్గించాలంటే.. కాలేయ పనితీరును మెరుగుపరుచుకోవాలంటే రోజువారీ డైట్‌లో క్యారెట

చర్మం నిగనిగలాడాలా? అయితే రోజూ ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తీసుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేకాదు.. శరీరంలోని కొవ్వును తగ్గించాలంటే.. కాలేయ పనితీరును మెరుగుపరుచుకోవాలంటే రోజువారీ డైట్‌లో క్యారెట్ తప్పకుండా ఉండి తీరాల్సిందే. చర్మ సౌందర్యాన్ని పెంపొందించాలంటే.. మచ్చలు, పిగ్మెంట్లను తొలగించాలంటే క్యారెట్లను తీసుకోవాలి. 
 
ఇంకా క్యారెట్లలోని విటమిన్ ఎ చర్మానికి సంబంధించిన ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. క్యారెట్ శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారినపడకుండా కాపాడుతుంది. క్యారెట్‌ని తినడం వల్ల దీనిలోని విటమిన్‌-ఎ రోగనిరోధకశక్తిని పెంచి పేగుల్లో ఏర్పడే ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. 
 
క్యారెట్‌లోని విటమిన్-ఎ జీర్ణమైన తర్వాత దానిలోని రెటినోయిక్ యాసిడ్ అనే రసాయనం పెద్దపేగుల్లో ఉండే మూడు రకాల రోగనిరోధక కణాల్లో రెండింటిని యాక్టివేట్ చేసేందుకు ఉపయోగపడతాయి. ఇవి శరీరంలోని ఇన్ఫెక్షన్‌లను తరిమికొడతాయి. సన్ డామేజ్ నుంచి క్యారెట్ చర్మాన్ని కాపాడుతుంది. విటమిన్ ఎ చర్మాన్ని, కురులకు, గోళ్ళను సంరక్షిస్తుంది.