శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 29 మే 2017 (16:03 IST)

గంజినీళ్లు తాగితే మేలేంటి?

తాతల ముత్తాల కాలంలో ఉదయం పూట అల్పాహారంగా గంజినీళ్లు తాగేవారు. అంబలి తాగేవారు. కానీ కుక్కర్ల పుణ్యమా అని గంజి నీళ్ల ప్రయోజనాలు చాలామందికి తెలియట్లేదు. అన్నాన్ని కుక్కర్లో ఉడికించడం కంటే.. అన్నం వార్చి

తాతల ముత్తాల కాలంలో ఉదయం పూట అల్పాహారంగా గంజినీళ్లు తాగేవారు. అంబలి తాగేవారు. కానీ కుక్కర్ల పుణ్యమా అని గంజి నీళ్ల ప్రయోజనాలు చాలామందికి తెలియట్లేదు. అన్నాన్ని కుక్కర్లో ఉడికించడం కంటే.. అన్నం వార్చి ఆ గంజిని తాగడం ద్వారా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గంజినీటిలో శరీరానికి కావాల్సిన ఎమినో యాసిడ్లు పుష్కలంగా ఉన్నాయి. 
 
ఎమినో యాసిడ్స్ ద్వారా గ్లూకోజ్ కంటే ఎక్కువగా తక్షణ శక్తిని అందిస్తాయి. గంజి తాగడం వలన కండరాలకు మేలు జరుగుతుంది. ఒక గ్లాస్ గంజిలో కొద్దిగా ఉప్పువేసి కలిపి తాగితే డయేరియా సమస్య నుండి బయట పడవచ్చు. గంజినీళ్లు ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి. 
 
అలాగే తలస్నానం చేసిన తర్వాత కొద్దిగా గంజిని వెంట్రుకలకు పట్టించి 15 నిమిషాల తర్వాత స్నానం చేస్తే వెంట్రుకలు కాంతివంతంగా.. వత్తుగా.. బలంగా పెరుగుతాయి. గంజినీళ్ల ద్వారా కడుపులో మంటను తగ్గించుకోవచ్చు. ఎసిడిటీని దూరం చేసుకోవచ్చు.