బెల్లం పాలు తాగితే అద్భుతమైన శక్తి... వాటిని తొలగిస్తుంది...

బుధవారం, 14 జూన్ 2017 (14:17 IST)

milk-Jaggery

రోజూ పాలు తాగడం మంచిదని, పాలు తాగడం వల్ల ఎముకలు, కండరాలు దృఢంగా మారుతాయని అందరికి తెలిసిన విషయమే. కానీ చాలామంది పాలు తాగడానికి ఇష్టపడరు. కానీ బెల్లం వేసిన పాలు రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట. బెల్లం మన శరీరంలోని రక్తకణాలను శుద్ధి చేస్తుంది. రోజూ ఈ బెల్లం వేసిన పాలను తాగడం వల్ల లివర్, కిడ్నీలను హాని కలిగించే వాటిని తొలగించి ఆరోగ్యంగా ఉంచుతుంది.
 
జీర్ణ సంబంధిత సమస్య వుంటే పాలల్లో కాస్త బెల్లం వేసుకుని తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. డిప్రెషన్, టెన్షన్ ఉన్నప్పుడు పాలలో కాస్త బెల్లం వేసుకుని తాగితే నిద్ర బాగా పడుతుంది. ఎవరైతే రాత్రిళ్లు నిద్ర బాగా పట్టదో వారు ఈ పాలు తాగితే మంచి ఫలితం ఉంటుందన్నారు డాక్టర్లు. నీరసంగా, అలసిపోయినప్పుడు బెల్లం పాలు తాగితే వెంటనే ఎనర్జీ వస్తుంది. బాగా ఆడుకునే పిల్లలకు బెల్లం పాలు యిస్తే తక్షణ శక్తి వచ్చి యాక్టివ్‌గా ఉంటారు. రోజూ ఈ పాలు తాగడం వల్ల కాలుష్యం తగ్గి ఎముకలు బలంగా కూడా మారుతాయట. అలాగే జాయింట్ పెయిన్స్, మజిల్స్ పెయిన్స్‌ను తగ్గిస్తుంది. 
 
బెల్లం మన శరీరంలోని బ్లడ్‌ను శుద్ధి చేస్తుంది. జుట్టు ఊడిపోకుండా తగ్గిస్తుంది. మహిళల్లో పీరియడ్స్‌లో వచ్చే నొప్పిని తగ్గించుకోవడానికి బెల్లం పాలు ఎంతగానో ఉపయోగపడుతుందట. పీరియడ్ అవ్వడానికి నాలుగు రోజుల ముందు నుంచి బెల్లం పాలు తాగితే పొట్టనొప్పి, నడుము నొప్పి సమస్యలను అధిగమించవచ్చు. బెల్లం పాలు తాగితే హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. 
 
జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు ఈ పాలు తాగితే చాలా రిలాక్స్‌గా ఫీలవుతారు. ముఖ్యంగా ఆస్తమా ఉన్న వారు ఈ పాలు తాగితే మంచి ఫలితం ఉంటుంది. బెల్లంలో పొటాషియం ఉంటుంది కాబట్టి శరీరంలోని బ్లడ్ ప్రెషర్, ఆమ్ల స్థాయిని కంట్రోల్ చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

మొలకొచ్చిన వెల్లుల్లి తింటే ఏమవుతుంది?

వెల్లుల్లిపాయల నుంచి మొలకలు రాగానే వాటిల్లో ఇంకేమీ సారం లేదని చెత్తలో పారేస్తారు. కానీ ...

news

ఎంత ఉష్ణోగ్రత వున్న నీటిని తాగితే ఆరోగ్యం...?

శరీర ఉష్ణోగ్రతకు నాలుగు సెంటిగ్రేడ్లు అటూఇటూగా అంటే, 32 నుంచి 40 సెంటిగ్రేడ్ల లోపల ...

news

అందమైన మహిళలు అందులోనూ ఘటికులే... కట్టుకున్న పురుషులు లక్కీలే...

అందమైన మగువలు శృంగారంలో మాత్రం మహా తెలివిగా ఉంటారని ఒక అధ్యయనంలో వెల్లడైంది. అందానికి ...

news

కాలేయాన్ని రక్షించి.. కీళ్ళనొప్పులను దూరం చేసే గ్రీన్ యాపిల్..

కీళ్ళనొప్పుల నుంచి ఉపశమనం లభించాలంటే రోజూ గ్రీన్ యాపిల్ తీసుకోవాల్సిందే అంటున్నారు ఆరోగ్య ...