శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By PNR
Last Updated : గురువారం, 18 సెప్టెంబరు 2014 (11:47 IST)

రక్తపోటును తగ్గించే ఆహారం.. చిట్కాలు...

రక్తపోటు సమస్య తీవ్రతను బట్టి మందులను వైద్యుల సలహా మేరకు వాడాల్సి ఉంటుంది. అయితే కేవలం మందుల మీదే పూర్తిగా ఆధారపడకుండా  ఆహారంతో కూడా దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. రక్తపోటు సమస్య అధికంగా ఉన్నవాళ్లు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఓసారి పరిశీలిద్దాం.
 
అధికంగా రక్తపోటు కలిగిన వారు ముఖ్యంగా పచ్చి టమోటాలను ఎక్కువగా తినాలి. టమోటాలలోని లైకోపిన్ రక్తపోటును బాగా తగ్గిస్తుంది. పండ్లు కూరగాయల రసాలు వాటిలోని పొటాషియం, రక్తకణాలు వ్యాకోచించేలా చేస్తుంది. క్రమం తప్పకుండా వీటిని తీసుకోవాలి. వీలైనంత వరకు రక్తపోటు ఉన్నవారు కాఫీ తాగడం తగ్గించాలి. వీలైతే మానెయ్యాలి. 
 
వంటకు నువ్వుల నూనె వాడండి. అది రెండు నెలల్లో బీపీని కంట్రోల్ చేయడం లేదా తగ్గించే అవకాశం ఉందని వైద్యులు చెపుతున్నారు. అలాగే శ్వాస మీద దృష్టి పెట్టి ధ్యానం, యోగా వంటివి చేసినా ఒత్తిడి తగ్గుతుందని వైద్యులు సలహా ఇస్తున్నారు.