శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By ttdj
Last Modified: బుధవారం, 12 అక్టోబరు 2016 (16:29 IST)

బూడిద గుమ్మడి ఇంటి ముందు దిష్టి తీసి పగలకొడతాం సరే... ఇందులో ఉండే ఔషధ గుణాలేమిటో తెలుసా..?

ఇంటి ముంగిట గుమ్మడిపండును వ్రేలాడదీయడం అలవాటు. అలాంటి బూడిద గుమ్మడిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. బూడిద గుమ్మడి మూత్ర వ్యాధులను నయం చేయడానికి ఉపయోగపడుతుంది. మూత్రంలో మంటను, చీము ఉన్న పరిస్థితిల్లోను ఫాస్ఫేట్‌ గాని అల్యూమినియం గాని ప

ఇంటి ముంగిట గుమ్మడిపండును వ్రేలాడదీయడం అలవాటు. అలాంటి బూడిద గుమ్మడిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. బూడిద గుమ్మడి మూత్ర వ్యాధులను నయం చేయడానికి ఉపయోగపడుతుంది. మూత్రంలో మంటను, చీము ఉన్న పరిస్థితిల్లోను ఫాస్ఫేట్‌ గాని అల్యూమినియం గాని పోతూ ఉండే పరిస్థితులోను ఇది బాగా పనిచేస్తుంది.
 
బూడిదగుమ్మడి జననాంగంలో నుంచి చీము వచ్చే స్త్రీల వ్యాధిలో తెల్లకుసుమ వంటి మూత్రాశయ వ్యాధుల్లో సుఖ వ్యాధుల్లోను, జననాంగంపైన కురుపులు ఏర్పడ్డప్పుడు ఇతర మందులతో పాటుగా బూడిద గుమ్మడి వాడితే వ్యాధి నుండి త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుంది. కడుపులో మంటగాని, గొంతులో మంట, కడుపు ఉబ్బరం, అతిదాహం ఉన్నప్పుడు కడుపులో ఉన్న గ్యాస్‌ వల్ల గుండెనొప్పి రావడం వంటి సమస్యల నుండి బూడిద గుమ్మడి రక్షిస్తుంది. గ్యాస్‌ ట్రబుల్‌ని నివారిస్తుంది.
 
కడుపులో ఏలికపాములు ఉన్నప్పుడు బూదిద గుమ్మడి గింజలను ఎండబెట్టి ఆ తరువాత దోరగా వేయించి కారం తగినంత కలుపుకుని కాస్తం అన్నంతో కలుపుకుని వాడితే కడుపులోని పురుగులు పడిపోతాయి. బూడిద గుమ్మడి రక్తపుష్టిని కలిగిస్తుంది. గర్భాశయ వ్యాధులతో బాధపడే  స్త్రీలకు ఇది చలువచేసి రక్తపుష్టిని కలిగించడానికి దోహదపడుతుంది. 
 
బూడిద గుమ్మడి లివర్‌ వ్యాధులన్నింటిలోనూ అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా కామెర్లవ్యాధిలో తీవ్రతను ఇది తగ్గిస్తుంది. ఊపిరితిత్తుల వ్యాదులలోను, టి.బి.వ్యాధిలో తీవ్రతను ఇది తగ్గిస్తుంది.ఊపిరితిత్తులకు బలాన్ని ఇస్తుంది. ఉబ్బస వ్యాధిలో గుమ్మడి వేరును దంచి అరచెంచాడు పొడిని వేడి నీటితో త్రాగాలి. దీని వల్ల ఉబ్బసం తీవ్రత తగ్గుతుంది. గుమ్మడి విత్తనాలను కూడా దంచి వాడుకోవచ్చు. మానసిక సమస్యలున్నప్పుడు ముఖ్యంగా హిస్టీరియా, ఫిట్స్ వంటి మానసిక వ్యాధులలో రోజూ బూడిదగుమ్మడిని ఆహారంలో తీసుకుంటే మంచిది. 
 
అమీబియాస్‌ వ్యాధి నివారణకు మంచి మందులా పనిచేస్తుంది. ఇది పేగులలోని మ్యూకస్‌ పొరను అభివృద్థి పరచడంలోను తద్వారా పేగులను ఆరోగ్యంగా ఉంచడంలోనూ తోడ్పడుతుంది. బూడిద గుమ్మడి లోపల ఉండే గుజ్జును బాగా పిండితే నీరు వస్తుంది. దీనిని సుమారు వందమిల్లీమీటర్లు తీసుకుని దానిలో ఒక తులం తవుడు, ఒక తులం పసుపు కలిపి రెండు పూటలా తాగడం వల్ల అతి మూత్ర వ్యాధి శాంతిస్తుంది. మధుమేహ రోగుల్లో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. 
 
బూడిద గుమ్మడికాయ లేతది తీసుకొని సన్నగా తరిగి, పుదీనా, కొత్తిమీర వంటివి తీసుకొని జీలకర్ర, లవంగాలు వంటి జీర్ణశక్తినిచ్చే సుగంధ ద్రవ్యాలతో పాటు వేసి వండుకున్న కూర తేలికగా జీర్ణమవుతుంది.