శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 11 జనవరి 2017 (19:27 IST)

శీతాకాలంలో కాలీఫ్లవర్స్ తీసుకుంటే..? నేతిలో కలిపి ఆహారంగా?

శీతాకాలంలో కాలీఫ్లవర్స్ తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. కాలీఫ్లవర్‌లో రక్తాన్ని పెంచే గుణం వుంది. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. ఈ ఆకులను పచ్చివిగా సలాడ్‌ ర

శీతాకాలంలో కాలీఫ్లవర్స్ తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. కాలీఫ్లవర్‌లో రక్తాన్ని పెంచే గుణం వుంది. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. ఈ ఆకులను పచ్చివిగా సలాడ్‌ రూపంలో ఆహారంగా తీసుకుంటారు.  కాలీఫ్లవర్‌ పచ్చి ఆకులు (50 గ్రాములు) నిత్యం తీసుకుంటే దంత సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.
 
ఉదయం పరకడుపున అరకప్పు గోబీ రసాన్ని ప్రతిరోజు తీసుకుంటే క్యాన్సర్‌ ప్రమాదం నుండి తప్పించుకోవచ్చు. క్యాలీఫ్లవర్‌ను నెయ్యితో కలిపి ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. కొలైటిస్‌ జబ్బువల్ల ప్రేగుల్లో వాపు కనపడుతుంది. దీన్ని నయం చేస్తుంది. కాలీఫ్లవర్‌కు ఒక గ్లాసు మజ్జిగలో 1/4వ వంతు పాలాకు రసం, ఒకగ్లాసు గోబీ ఆకు రసాన్ని ప్రతి రోజు రెండు పూటలా తీసుకుంటే కొద్దిరోజుల్లోనే కొలైటిస్ జబ్బు నయమౌతుంది.