గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : సోమవారం, 1 అక్టోబరు 2018 (17:27 IST)

ఒకేచోట కూర్చొన్నా ఫర్లేదు.. కాళ్లూ చేతులు ఆడిస్తే చాలు...

చాలా మంది ఐటీ నిపుణులు, బ్యాంకు ఉద్యోగులు కంప్యూటర్ ముందు గంటల తరబడి ఒకే చోట కూర్చొని విధులు నిర్వహిస్తుంటారు. ఇలాంటిలోనే ఎక్కువగా హృద్రోగ సమస్యలు వస్తుంటాయి.

చాలా మంది ఐటీ నిపుణులు, బ్యాంకు ఉద్యోగులు కంప్యూటర్ ముందు గంటల తరబడి ఒకే చోట కూర్చొని విధులు నిర్వహిస్తుంటారు. ఇలాంటిలోనే ఎక్కువగా హృద్రోగ సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా, ఒకే చోట గంటల తరబడి కూర్చొని పని చేస్తున్న వారిలోనే గుండె జబ్బులు వస్తున్నట్టు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మిస్సోరీ చేసిన అధ్యయనంలో వెల్లడైంది.
 
ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోకుండా కాళ్లూచేతులు ఆడిస్తే గుండెఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాసేపు లేచి అటు ఇటు తిరగడం వల్ల గుండెకు బలం చేకూరుతుందట. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు దృఢంగా మారి హృద్రోగాలను దరిచేరనీయవు. నరాల వ్యాధులు కూడా రాకుండా అరికడుతుందట. 
 
ఈ వర్శిటీ నిపుణులు తమ పరిశోధన కోసం 11 మంది ఆరోగ్యవంతమైన ఐటీ నిపుణులను ఎంచుకున్నారు. వారిని మూడు గంటలపాటు కూర్చోబెట్టి నిమిషానికి 250 సార్లు ఒక కాలును మాత్రమే ఊపాలని సూచించారు. మరో కాలును కదలకుండా ఉంచాలని చెప్పారు. ఆ తర్వాత పరిశీలించగా రెండు కాళ్లలోని ధమనుల రక్త ప్రసరణలో తేడాకనిపించింది. కదిలించిన కాళ్లలోని ధమనుల్లో రక్తప్రసరణ బాగా జరిగినట్టు గుర్తించారు.