శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (16:18 IST)

మానవుల కష్టాలకు, బాధలకు కారణం ఏమిటి?

మానవులు క్రిందటి జన్మలో వారు, వారు చేసుకున్న పనులను బట్టే ఈ జన్మలో సుఖదుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు. ఇది కర్మ సిద్దాంతం. సృష్టి అంతా దీనికి కట్టుబడి ఉండవలసిందే. దీనికితోడు అహంకారం కొన్ని బాధలను తెచ్చిపెట్టవచ్చు. ఎంతటివారైనా కర్మఫలం అనుభవింపక తప్పదు. అది

మానవులు క్రిందటి జన్మలో వారు, వారు చేసుకున్న పనులను బట్టే ఈ జన్మలో సుఖదుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు. ఇది కర్మ సిద్దాంతం. సృష్టి అంతా దీనికి కట్టుబడి ఉండవలసిందే. దీనికితోడు అహంకారం కొన్ని బాధలను తెచ్చిపెట్టవచ్చు. ఎంతటివారైనా కర్మఫలం అనుభవింపక తప్పదు. అది సృష్టి వైచిత్రి.
 
మహాభారతంలోని ఒక ఘట్టంలో ధర్మరాజు, అతడి నలుగురు సోదరులు శ్రీకృష్ణ సహితులై శరతల్పగతుడైన భీష్ముని వద్దకు వెళ్లినప్పుడు పాండునందనులను కూర్చుండ నియోగించి భాష్పలోచనుడై భీష్ముడు ఇలా అంటాడు. మీరు ధర్మబద్దులై బ్రతుకదలచి బహువిధ అపత్పరంపరలకు గురి అయ్యారు.
 
ఇది బహు విచిత్రమైన విషయం. పాండవులు మహాబలులై పరమేశ్వరుడి అండదండలుండి ఆపదలు తప్పకపోవడం చోద్యంగా కనిపిస్తుంది. ఈశ్వరుడు ఎవరికి ఏమి చేస్తాడో తెలియదు. అతని మాయలకు మహాత్ములు, విద్వాంసులు కూడా అణిగి మెలిగి ఉన్నారంటే.... ఇక సామాన్యుల సంగతి ఏమనాలి? కర్మఫలం అనుభవింపక తప్పదనడానికి, ఎంత సద్ధర్మపరులకైనా కష్టాలు తప్పవనడానికి ఇది ప్రబల నిదర్శనం కదా. 
 
అయితే భక్తి కన్నా మిన్న మరేది లేదు. అవతారమూర్తి అయిన శ్రీరాముడు లంకకు వెళ్లడానికి వంతెన కట్టవలసి వచ్చింది. కానీ శ్రీరాముని యందు పరిపూర్ణమైన భక్తిగల హనుమంతుడు ఒక్క గెంతుతో సముద్రాన్ని దాటాడు. ఇది భక్తి ప్రభావాన్ని చాటుతుంది. మతం ఏదైనా, ఇష్ట దేవత ఎవరైనా వారివారి మహోన్నత మత ధర్మాల్లో వారివారి ఇష్ట దేవతలో పరిపూర్ణ విశ్వాసం భక్తి ప్రపత్తులతో వ్యవహరించడం అలవరుచుకోగలిగినప్పుడే మానవాళి సుఖఃశాంతులతో మనగలుగుతుంది. అన్ని మతాల సారం ఒక్కటే. సృష్టి రహస్యాన్ని గుర్తెరిగి ప్రవర్తించగలవారి జీవితం ధన్యమవుతుంది. ఇది సత్యం.