Widgets Magazine

భగవంతుడి అనుగ్రహం కలగాలంటే...?

మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (20:38 IST)

ఆధ్యాత్మికపరంగా భగవంతుని చేరుకోవాలంటే కొన్ని కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. దీనికి సాధన ఎంతో ముఖ్యం. సాధన పరిపుష్టి కానిదే గమ్యాన్ని చేరలేము. ఏ కాస్తయినా కోరిక అనేది ఉన్నట్లయితే భగవంతుణ్ణి ప్రాప్తించుకోలేము. ధర్మం అతి సూక్ష్మమైనది. సూదిలోకి దారం ఎక్కించేటప్పుడు దారంలో ఒక్క నూలుప్రోగు విడివడి ఉన్నా సరే, దానిని సూదిలోకి ఎక్కించలేము.
 
కొందరు ముప్పై ఏళ్లపాటు జపం చేసి ఉంటారు. అయినప్పటికి ఏమి ప్రయోజనం... కుళ్లిపోతున్న పుండు మామూలు మందులతో మానదు. దానికి పిడకలు కాల్చి వాతలు పెట్టవలసి ఉంటుంది. కోరికలు ఉన్నట్లయితే, సాధనలు ఎన్ని చేసినప్పటికి యోగం సిద్ధిచదు. కాని ఒక్క విషయం మాత్రం నిజం. భగవత్ కృప కలిగినట్లయితే ఆయన కనుక అనుగ్రహించినట్లయితే ఒక్కక్షణం లోనే యోగం సిద్దిస్తుంది. వెయ్యేళ్లుగా చీకటితో నిండిన గదిలోకి ఎవరైనా దీపాన్ని తీసుకువస్తే ఆ గది ఒక్కక్షణంలో ప్రకాశవంతమవుతుంది.
 
పేద బాలుడొకడు ఒక పెద్ద ఆసామి దృష్టిలో పడ్డాడు. ఆయన ఆ పేదవాడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. వెంటనే ఆ పేదవాడికి ఇల్లూవాకిలీ, పొలంపుట్రా, బండ్లు వాహనాలు, సేద్యగాండ్రూ అన్నీ చేకూరాయి. భగవంతుడిది బాలక స్వభావం. పిల్లవాడొకడు జేబులో రత్నాలు పెట్టుకొని ఇంటి గడప మీద కూర్చొని ఉన్నాడనుకుందాం. దారిలో ఎంతోమంది వస్తూపోతూ ఉంటారు. వారిలో చాలామంది ఆ బాలుణ్ణి రత్నాలు ఇవ్వమని అడుగుతారు. 
 
కాని ఆ పిల్లవాడు ముఖం ప్రక్కకు త్రిప్పుకొని ఊహూ నేను ఇవ్వనంటే ఇవ్వను అంటాడు. అయితే కాసేపటి తర్వాత ఎవరో వ్యక్తి ఆ దారిన వెళుతున్నాడనుకుందాం. అతడు రత్నాలు కావాలని కూడా అడుగడు. అయినాసరే, ఈ బాలుడు అతడి వెంట పరుగు పరుగున వెళ్లి రత్నాలన్నింటినీ బలవంతంగా ఆ వ్యక్తి చేతిలో పెడతాడు. అలాగే సాధన పూర్తి అయినవారికి భగవత్ కృప దానంతట అదే లభిస్తుంది అనడంలో సందేహం లేదు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

వినాయక చతుర్థి స్పెషల్- బనానా హల్వా ఎలా చేయాలంటే?

నాన్‌స్టిక్ పాన్‌లో కోవా, అరటి పండు ముక్కలు వేసి స్టౌ మీద వుంచాలి. మీడియం హీట్‌పై వుంచి ...

news

మంగళవారం రోజున హనుమంతుని పూజిస్తే..?

శ్రీరాముడు హనుమంతునితో పరిచయం కాగానే ఆయనలోని కార్యదీక్షను గమనించారు. అంతేకాకుండా ఆయనలోని ...

news

వినాయక చవితి రోజున ఎరుపు రంగు గణనాథుడిని పూజిస్తే?

గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోవాలంటే వినాయక చవితి రోజున గణనాథుడిని ...

news

వినాయకచవితి రోజున ఎవరైతే చంద్రుడిని చూస్తారో?

గణపతి సకల దేవతలకు గణ నాయకడు. ఎవరు ఏ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా ముందుగా గణపతిని ...

Widgets Magazine