కాఫీ త్రాగడం వలన మీ ఆరోగ్యానికి?

కాఫీతో కొన్ని రకాలైన ప్రయోజనాలున్నాయి. కెఫీన్ ను ఎక్కువగా తీసుకోవటం మీ ఆరోగ్యానికి మంచిది. రోజుకు రెండుమూడు కప్పుల కాఫీ తాగటం వలన కాలేయ క్యాన్సర్ వ్యాధుని నివారిస్తుంది.

Kowsalya| Last Updated: సోమవారం, 14 మే 2018 (13:06 IST)
కాఫీతో కొన్ని రకాలైన ప్రయోజనాలున్నాయి. కెఫీన్‌ను ఎక్కువగా తీసుకోవటం మీ ఆరోగ్యానికి మంచిది. రోజుకు రెండుమూడు కప్పుల కాఫీ తాగటం వలన కాలేయ క్యాన్సర్ వ్యాధిని నివారిస్తుంది. కాఫీలో ఉండే కెఫిన్ వల్ల గుండెపోటుకు దారి తీసే హానికరమైన ఎంజైములు నశిస్తాయి. ఇది రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంది. 
 
ఉబ్బసం వ్యాధి కంట్రోల్‌లో ఉంటుంది. కాఫీ డికాక్షన్ సేవించటం వల్ల జలుబు, దగ్గు, అతి నిద్ర, మూత్రం సాఫీగా నడవక పోవటం లాంటి లక్షణాలు తగ్గుతాయి. కాఫీలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉంటాయి. కాఫీ తాగడం వలన రెండు రకాల కేన్సర్‌ల నుండి సంరక్షణ లభిస్తుంది. కాలేయం కేన్సర్ నివారణతోపాటు, ఫ్యాటీ లివర్ వ్యాధులతో పోరాడటంలో కాలేయాన్ని సంరక్షిస్తుందని కూడా నివేదించబడింది.
 
కాఫీ వలన జీవక్రియ రేటు 3 నుండి 11 శాతం పెరుగుతుంది. 1 కప్ బ్లాక్ కాఫీలో కేవలం రెండు కెలోరీలు మాత్రమే ఉంటాయి. దీని వలన నాడీ వ్యవస్థ కూడా ప్రేరేపించబడుతుంది, ఇది శరీరంలోని కొవ్వును విచ్ఛిన్నం చేయాలని కొవ్వు కణాలకు సంకేతాలు ఇస్తుంది.దీనిపై మరింత చదవండి :