శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: బుధవారం, 29 జూన్ 2016 (14:21 IST)

ఏమి తింటే ఏమి లాభం.. ఇవి ఆర‌గించండి! ఆనందించండి!!

* అల్లం తిన‌డం వ‌ల్ల‌ ఎక్కిళ్ళు తగ్గుతాయి. * క‌రివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది. * గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.

* అల్లం తిన‌డం వ‌ల్ల‌ ఎక్కిళ్ళు తగ్గుతాయి.
* క‌రివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.
* గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
 
* అవకాడో ఫలాలు తరచుగా తింటే మలబద్దకం త‌గ్గుతుంది.
* జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తుంది.
* బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.
* సజ్జల్ని ఎక్కువగా తీసుకోవ‌డం వ‌ల్ల‌ పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.
 
* మామిడిపండ్ల‌కి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.
* బీట్ రూట్ తిన‌డం వ‌ల్ల బీపీని క్రమబద్దీకరిస్తుంది.
* మునగాకు ఆహారంలో తీసుకోవ‌డం వ‌ల్ల గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
* దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పని చేస్తుంది.
* ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది. అజీర్తిని తగ్గిస్తాయి.
 
* అల్లం మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.
* కీరదోసలోని సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.
* క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.నరాల బలహీనత నుండి కాపాడుతుంది.
* మొక్కజొన్న మూత్రపిండాల వ్యాధులున్న వారికి మంచి ఔషదంలా ప‌ని చేస్తుంది.
 
* ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.
* అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉండ‌డం వ‌ల్ల‌ వాపుల్ని తగ్గిస్తుంది.
* పుచ్చకాయలో ఉండే లైకొపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి ర‌క్షిస్తుంది.
* సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.
 
* దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.
* మున‌గ‌కాయ‌లు ఆకలిని పెంచడానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయి.
* చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
* కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందులా ప‌ని చేస్తాయి.
* ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి.
 
* ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.
* టొమాటోలకు ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి ఉంది.
* బొప్పాయి మొలల వ్యాధికి  మంచి మందులా ప‌ని చేస్తుంది.
* యాపిల్ తిన‌డం వ‌ల్ల‌ నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.
* వాము వ‌ల్ల దంత వ్యాధుల నుండి ఉప‌శ‌మ‌నం అభిస్తుంది.
 
* జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.
* జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
* నేరేడు పండ్లలో జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచి,కడుపులో పురుగులు చనిపోతాయి.
* ద్రాక్షలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది, పైటోకెమికల్స్.. కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.