శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 28 జూన్ 2019 (21:27 IST)

నెల రోజుల్లో బానపొట్ట ఫ్లాట్... ఈ చిట్కాలు పాటిస్తే సరి...

అధికబరువు ఉంటే అప్పుడు మనకు కలిగే ఇబ్బందులు ఏంటో అందరికీ తెలుసు. దీనికితోడు పొట్ట ఎక్కువగా ఉంటే ఆ సమస్య మరింత ఎక్కువవుతుంది. అయితే ఒక సింపుల్ ఎక్సర్‌సైజ్‌ను రోజూ నాలుగు నిమిషాల పాటు చేస్తే 28 రోజుల్లోనే శరీరంలో ఉన్న అధిక కొవ్వు తగ్గిపోతుంది. అంతేకాదు పొట్ట కూడా తగ్గి నాజూగ్గా తయారవ్వడం ఖాయమని వైద్యులు చెబుతున్నారు.
 
నేలపై బోర్లాపడుకుని మోచేతులను కాలివేళ్ళను ఆధారంగా చేసుకుని శరీరం మొత్తాన్ని పైకి లేపాలి. ఈ భంగిమలో వీలైనంత సేపు ఉండాలి. దీంతో పొట్ట, ఛాతి కండరాలు, భుజాలపై అధిక ఒత్తిడి పడుతుంది. ఇది ఆయా భాగాల్లో ఉండే కొవ్వును కరిగిస్తుంది. మొదటి రెండురోజులు 20 సెకండ్లు, మూడు, నాలుగవరోజు 30 సెకండ్లు, ఐదవరోజు 40 సెకండ్లు, ఆరవరోజు రెస్టు తీసుకోవాలి. ఏడు, ఎనిమిది 45 సెకండ్లు, 9,10,11వతేదీల్లో  60 సెకండ్లు, 12వరోజు 90సెకండ్లు, 13వరోజు రెస్ట్ తీసుకోవాలి. 
 
అలాగే 14,15వ రోజుల్లో 90సెకండ్లు, 16,17రోజుల్లో 120 సెకండ్లు, 18వరోజు 150 సెకండ్లు, 19వతేదీ రెస్ట్ తీసుకోవాలి. 20,21రోజుల్లో 150 సెకండ్లు, 22,23రోజుల్లో 180 సెకండ్లు, 24వ రోజులో 210 సెకండ్, 25న రెస్ట్ తీసుకోవాలి. 26వ రోజున 210 సెకండ్లు, 27,28రోజుల్లో 240సెకండ్లు చేయాలి. ఇలా ప్రతిరోజు చేస్తే ఎక్సర్‌సైజ్ చేస్తే ఫలితం ఉంటుంది. పొట్ట కరగడమే కాదు..క్రొవ్వు కూడా కరుగుతుందంటున్నారు వైద్యులు.