Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎలాంటి జ్వరాన్నయినా చిటికెలో పోగొట్టే చిట్కా... ఏంటో తెలుసా?

శనివారం, 10 జూన్ 2017 (20:49 IST)

Widgets Magazine
health tips

జ్వరం. ఏదో ఒక పరిస్థితిలో ప్రతి ఒక్కరు జ్వరం బారిన పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యంగా ఉండే వ్యక్తి శరీర ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెంటీగ్రేట్. అంటే 98.6 డిగ్రీల ఫారన్ హీట్ ఉంటుంది. జ్వరం వస్తే బాడీ టెంపరేజర్ పెరుగుతుంది. జ్వరం తీవ్రత 107 డిగ్రీల ఫారన్ హీట్ మించినప్పుడు బ్రెయిన్ డామేజ్ అవుతుంది. జ్వరం వచ్చినప్పుడు జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఏమీ తినాలని అనిపించదు. నోరంతా చేదుగా ఉంటుంది. నీరసంగా ఉంటుంది. జ్వరాన్ని తగ్గించాలంటే వేడిని తగ్గించాలని.. బాడీలోని టెంపరేచర్‌ను కంట్రోల్ చేయాలి.
 
అమాంతం పెరిగిపోయిన టెంపరేచర్‌ను నార్మల్ లెవల్‌కు తీసుకువస్తే జ్వరాన్ని తగ్గించనట్లే. అందుకోసం చిన్న చిట్కాను పాటిస్తే సరిపోతుంది. అదే పెసరపప్పు. ఎంత పెద్ద జ్వరాన్నయినా ఇట్టే తగ్గించే గుణం పెసరపప్పుకు ఉంటుంది. ఒక కప్పు పెసరపప్పును తీసుకుని దానిని బాగా కడిగి ఒక గిన్నెలో నిండా నీళ్ళు పోసి అందులో పెసరపప్పును 20 నిమిషాలు నానబెట్టాలి. ఆ తరువాత పెసరపప్పులోని నీళ్ళను తీసుకుని జ్వరంతో బాధపడుతున్న వ్యక్తికి తాగించాలి. ఈ నీటిని తాగితే 10 నిమిషాల్లో బాడీ టెంపరేచర్ క్రమంగా తగ్గుతూ వస్తుంది. 20 నిమిషాల తరువాత అతను సాధారణ స్థితికి చేరుకుంటాడు. ఆ సమయంలో తేలికగా జీర్ణమయ్యే పదార్థాలను తినిపించాలి. దీంతోపాటు వైద్యులు ఇచ్చే మందులు కూడా వాడాలి.
 
పెసరపప్పులో వేడిని తగ్గించే అద్భుతమైన గుణాలున్నాయి. 20 నిమిషాలు పెసరపప్పు నానబెడితే ఆ గుణాన్ని నీటికి సంక్రమింపజేస్తుంది. పెసరపప్పులో విటమిన్ బి, సి, మాంగనీస్‌తో పాటు ప్రోటీన్లు కూడా అధికంగా ఉంటాయి. అలాగే సూర్యుని నుంచి వచ్చే అతినీలోహిత కిరణాలు, పర్యావరణం నుంచి వచ్చే చర్మ సమస్యలను నుంచి కూడా కాపాడేశక్తి పెసలకు ఉంటుంది. పెసలను వారానికి రెండుసార్లయినా ఆహారంలో భాగం చేసుకోవాలి. వేడి ఎక్కువగా ఉండేవాళ్ళకు ఈ పెసరపప్పు ఒక వరం. అందుకే పండుగల వేళ పెసరపప్పు పానకం చేస్తారు. శరీరంలోని వేడిని తగ్గించడమే కాదు... వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలోను పెసరపప్పు సమర్థవంతంగా పనిచేస్తుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

కాళ్ళ పగుళ్ళు పోవాలంటే చాలా సింపుల్...

సాధారణంగా కాళ్ళు పగలడానికి ముఖ్య కారణం కాళ్ళను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం. శరీరంలో ...

news

కలబందతో బరువును తగ్గించవచ్చు... ఎలాగంటే?

అధిక బరువుతో బాధపడే వారు కలబంద రసాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకొంటే శరీర అవయవాల ...

news

బఠాణీ తొక్కతో సహా తింటే ఏంటి ఉపయోగం?

గింజలు మాత్రమే తినే సాధారణ బఠాణీలనే గార్డెన్ పీస్ అంటారు. ఇవికాకుండా చిక్కుడుకాయ మాదిరిగా ...

news

షాకింగ్... భారతదేశ పురుషులకు ఏమవుతుంది...?

అన్నీ ఆసుపత్రులు కిటకిట. ఎందుకో తెలుసా.. సంతానం కోసం. సంతాన సాఫల్యత కోసం కొత్త దంపతులు ...

Widgets Magazine