Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కడుపుకి నిత్యం ఇవి పట్టిస్తుంటే ఇక సుఖనిద్ర ఎలా వస్తుంది నాయనా?

హైదరాబాద్, శుక్రవారం, 7 జులై 2017 (07:24 IST)

Widgets Magazine
sleep

నేటి జీవితంలో 8 గంటల పని తర్వాత ఇంటికి వచ్చి కాస్సేపు జీవన సహచరి లేదా సహచరుడితో, పిల్లలతో గడిపి హాయిగా నిద్రపోయే పరిస్థితులు కరువవుతున్నాయి. అందుకే నిద్ర సుఖమెరుగదు అని అలనాటి పెద్దలు అంటే సుఖనిద్రా.. అంటే ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు నేటి పెద్దలు. ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే నింపాదితనానికి ఇప్పుడు చోటేలేదు. బతకడానికి డబ్బులు కావాలంటే నిద్రలేచింది మొదలు ఉరుకులు, పరుగులతో ఉద్యోగానికో, పనికో పరుగెత్తాల్సిందే. రోజువారీ లక్ష్యాలు, పేరుకుపోతున్న టార్కెట్ల సాధన మధ్య సరైన నిద్ర కోసం అల్లాడిపోవడమొకటే ఇప్పుడు జనాలకు బాగా తెలిసిన విషయం. 
 
అయితే ఇంత సంక్లిష్ట, సంక్షుభిత, వేగ జీవితంలో కూడా పడుకునే ముందు ఒకరకమైన ఆహార అలవాట్లు ఏర్పర్చుకుంటే హాయిగా నిద్రపోవచ్చని సమతుల ఆహార నిపుణులు చెబుతున్నారు. మనిషి నిద్రకు ఉపకరించే హార్మోన్ ట్రిఫ్టోఫాన్. ఇది మన ప్రపంచంలో సహజంగా దొరికే ఐదు ఆహార పదార్ధాల్లో పుష్కలంగా లభిస్తుందట. అవేమిటంటే 1. అరటి పండు 2. ఒక గ్లాసు పాలు 3. తేనె 4. బాదం 5. ఓట్స్‌. అయితే సుఖ నిద్రపోవాలంటే  ఇకపై  స్పైసీ పదార్థాలు, కాఫీ, టీ లాంటి డ్రింక్స్‌ అసలు తీసుకోకూడదని చెబుతున్నారు వీరు.
 
అరటిపండులో కార్భోహైడ్రెట్స్‌ శాతం ఎక్కువ. ఇవి మెదడులోని ట్రిప్టోఫాన్‌ హర్మోన్‌ ను ఉత్తేజపరుస్తాయి. అంతేగాకుండా తలత్రిప్పడాన్ని కూడ తగ్గిస్తాయి. ఇంకా అరటి పండులో పుష్కలముగా లభించే మెగ్నీషియం నరాలు, కండరాలకు విశ్రాంతి కలిగిస్తుంది. దీంతో సుఖంగా నిద్రపోవచ్చు.
 
ఇక నిద్రకు ఉపకరించేముందు గ్లాసు వేడి పాలు తాగాలని మన పెద్దలు చెప్పిన విషయమే. ఇక పాలల్లో ట్రిప్టోఫాన్‌ హర్మోన్‌ ఉత్తేజపరిచే గుణాలు ఎక్కువగా ఉన్నాయని సామ్మి పేర్కొన్నాడు. అంతేగాకుండా  మెదడుపై ఒత్తిడి పడకుండా చూస్తుందని, శరీరంలోని కాల్షియం కొరత లేకుండా చేస్తుందన్నారు.
 
 టేబుల్ స్పూన్ తేనేను నిద్రపోయే ముందు తీసుకుంటే హాయిగా నిద్రపోవచ్చు. తేనేలో కూడా ట్రిప్టోఫాన్‌ ప్రేరేపించే గుణాలు ఎక్కువగా ఉన్నాయి.
 
 రాత్రి వేళల్లో ఆకలిగా ఉంటే ఓట్స్‌ను ఆహార పదార్థాలను ఆహారంగా తీసుకుంటే సుఖంగా నిద్రపోవచ్చు. ఇక వేడి పాలల్లో ఓట్స్‌, తేనే, కలుపుకొని, అరటిపండుతో తీసుకుంటే ఉదయం లేచిన తర్వాత ఉల్లాసంగా ఉంటారు.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

ఆహ్, అబ్బో, ఔచ్, నడుము నొప్పి, వెన్ను నొప్పి పోయేందుకు అదే మార్గం

సాధారణంగా నిత్యం ఎంతో బిజీగా గడిపే మహిళామణులు శృంగారం దగ్గరకి వచ్చేసరికి అక్కడ నొప్పి.. ...

news

పచ్చటి గార్డెన్‌ మెత్తటి గడ్డిపై వ్యాయామం చేస్తే ఏమవుతుంది?

అడవుల నరికివేత ఎక్కువై ప్రాణవాయువు తక్కువవుతున్న తరుణంలో ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమతమ ఇంటి ...

news

ఉప్పు పెరిగితే బీపీ వస్తుంది... మరి తగ్గితే ఏమొస్తుందో తెలుసా?

ఉప్పు పేరు చెబితే బీపీ వున్నవారికి బీపీ పెరిగిపోతుంది. నాలుకకు కాస్త ఉప్పు తగిలినా ఆ ...

news

పురుషులకు కూడా ప్రత్యేకంగా గర్భనిరోధక మాత్రలు

గర్భనిరోధక సాధనాలలో బహుళ ప్రాచుర్యం పొందిన కాంట్రాసెప్టివ్‌ పిల్స్‌ మహిళల కోసం ...

Widgets Magazine