శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 20 మార్చి 2015 (18:38 IST)

జీర్ణక్రియను మెరుగు పరిచే ఫ్రూట్ జ్యూసులేంటి?

జ్యూసులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. పొట్ట ప్రేగులను స్మూత్ చేస్తాయి. వీటిలో ప్రోబయోటిక్స్ కలిగి ఉంటాయి. ఇవి డైజెస్టివ్ సిస్టమ్‌ను హెల్తీగా ఉంచుతుంది. డైజెస్టివ్ ట్రాక్ నుండి మలినాలను ఫ్లష్ అవుట్ చేస్తుంది. హార్ట్ బర్న్, హైపర్ అసిడిట్, గాస్ట్రిక్‌కు చాలా మేలు చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుచుకోవడానికి జ్యూస్‌లు ఎంతగానో ఉపయోగపడతాయి. 
 
ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉండి, ఇది పొట్టలో అసిడ్‌కు పెంచుతుంది. దాని వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. ఇది అల్సర్  అంతర్గత రక్తస్రావంను నివారిస్తుంది. ఈ జ్యూస్ మెటబాలిజం రేటును పెంచుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రెడ్ గ్రేప్ జ్యూస్‌ను తీసుకోవడం ద్వారా డైజిస్టివ్ ట్రాక్ శుభ్రమవుతుంది. బౌల్ మూమెంట్ మెరుగుపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి డైజెస్టివ్ ట్రాక్‌లోని టాక్సిన్స్‌ను తొలగిస్తాయని వైద్యులు చెబుతున్నారు.