దాని పేరు చెబితే అందరూ ముక్కు మూసుకుంటారు. ఆ నల్లది ఉంటే చాలు మటుమాయమే..

హైదరాబాద్, గురువారం, 29 జూన్ 2017 (08:43 IST)

గ్యాస్‌ ఏర్పడినప్పుడు అందరూ చేసే పని యాంటాసిడ్‌ వేసుకోవడం. అలా కాకుండా టీ స్పూను మిరియాలను వేయించి పొడి చేసి, చిటికెడు లవంగాల పొడి, పావుచెంచా వెల్లుల్లి మిశ్రమం తీసుకుని గ్లాసు నీటిలో మరిగించి వడకట్టి, తేనెతో కలిపి రోజూ రెండు మూడుసార్లు చొప్పున తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల కడుపులో గ్యాస్‌ సమస్యతోబాటు జలుబు, దగ్గు వంటి అనారోగ్యాలు కూడా నయం అవుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
 
కప్పు మజ్జిగలో పావు చెంచా మిరియాల పొడిని కలిపి తీసుకోవచ్చు లేదా పసుపు, మిరియాల పొడి మిశ్రమాన్ని చిటికెడు చొప్పున తీసుకుని నీటిలో మరిగించి రాత్రిళ్లు తాగితే జలుబు, తుమ్ములు తగ్గుతాయి. పళ్లనొప్పులకు... అర టీ స్పూన్‌ నల్ల మిరియాల పొడి, కొద్దిగా లవంగం నూనెలను తీసుకుని మిశ్రమంగా తయారు చేయాలి. దాన్ని నొప్పి పెడుతున్న పన్నుపై అప్లై చేయాలి. రోజూ ఇలా చేస్తుంటే పంటినొప్పి తగ్గడంతోపాటు పళ్లు దృఢంగా తయారవుతాయి.
 
టేబుల్‌ స్పూన్‌ తాజా నిమ్మరసం, అర స్పూన్‌ నల్ల మిరియాల పొడి, టీస్పూన్‌ ఉప్పులను ఒక గ్లాస్‌ వేడినీటిలో కలిపి మిశ్రమంగా తయారు చేయాలి. దీన్ని నోటిలో పోసుకుని పుక్కిలిస్తూ ఉంటే గొంతునొప్పి, మంట, దగ్గు తగ్గుతాయి. తలనొప్పి నివారణకు యాస్ప్రిన్‌ వేసుకోవడం అందరూ చేసే పనే. అలా కాకుండా దాల్చిన చెక్కను నీటితో తడిపి అరగదీసి కణతలకు పూస్తూ ఉంటే తలనొప్పి ముఖ్యంగా జలుబు వల్ల వచ్చే తలనొప్పి సులువుగా తగ్గిపోతుంది.
 దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

పండ్ల ముక్కలను చెక్కెర లేదా తేనెతో కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?

అన్నంలోకి పాలు, అటుకుల్లోకి పాలు, పళ్ల ముక్కల్లోకి పాలు.. ఇలా ఎన్నెన్నో ఆహార పదార్థాలతో ...

news

శృంగార సామర్థ్యానికి మునగ పువ్వు... పావు లీటరు ఆవుపాలతో....

శృంగార సామర్థ్యం లోపం కారణంగా చాలామంది అనేక రకాల పద్ధతులను అవలంభిస్తుంటారు. కానీ కళ్ల ...

news

ఉల్లిపాయతో పంటి నొప్పి మాయం.. కివీస్, చీజ్, మష్రూమ్స్, స్వీట్ పొటాటో తీసుకుంటే?

ఉల్లిపాయ మన ఆరోగ్యానికి కావలసిన వ్యాధినిరోధక శక్తిని ఇవ్వడంతో పాటు క్రిములను ...

news

సెల్ ఫోన్, కంప్యూటర్లలో గంటల పాటు పనిచేస్తున్నారా?: చేతివేళ్లు భద్రం గురూ...

కంప్యూటర్లలో గంటల పాటు పనిచేస్తున్నారా? అయితే మీ చేతివేళ్లు భద్రం అంటున్నారు ఆరోగ్య ...