శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : శనివారం, 26 జులై 2014 (19:05 IST)

అల్సర్‌ను దూరం చేసే గ్రీన్ బనానాస్.. అండ్ హెల్త్ టిప్స్!

అలర్స్‌ను దూరం చేసుకోవాలా? అయితే రోజూ ఓ గ్రీన్ బనానా తీసుకోండి. పేగు సంబంధిత వ్యాధులు, పొట్టనొప్పికి చెక్ పెట్టాలంటే పచ్చరంగు అరటి పండ్లను వారానికి రెండు సార్లైనా తీసుకోవాలి. రోజూ రాత్రి నిద్రించేందుకు ముందు గ్రీన్ బనానా తీసుకుంటే ఉదర సంబంధిత రోగాలను నయం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు
 
* బెండకాయ గింజలను కొంచెం బార్లీ గంజిలో చేర్చి మరిగించి మూడు రోజుల పాటు తీసుకుంటే కిడ్నీ సంబంధిత రోగాలను దూరం చేసుకోవచ్చు. అంతేగాకుండా యూరినరీ ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చు.  
 
* ఆహారం తీసుకోవడానికి అరగంట ముందు అరస్పూన్ ఆలివ్ తీసుకుంటే రక్తనాళాల్లో ఏర్పడే ఫ్యాట్‌ను తొలగించుకోవచ్చు.  
 
* నోటి పూతతో బాధపడుతున్నట్లైతే కొబ్బరి బోండాంలోని కొబ్బరిని తీసుకుంటే ఫలితం ఉంటుంది.  
 
* రాత్రి నిద్రించేందుకు ముందు వేడినీటిలో కాసింత తేనె కలిపి.. ఆ నీటితో పుక్కిలించుకుంటే దంత సమస్యలను దూరం చేసుకోవచ్చు. బ్యాక్టీరియాతో సమస్యలుండవు. పంటి ఎనామల్ సురక్షితంగా ఉంటుంది.