మంగళవారం, 7 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : గురువారం, 6 సెప్టెంబరు 2018 (15:43 IST)

కడుపులో నులిపురుగులు తొలగిపోయేందుకు ఇది తీసుకుంటే?

నులిపురుగుల సమస్య పిల్లల్లోనే కాదు పెద్దల్లోనూ కనిపిస్తుంటుంది. నులిపురుగులు కడుపులో ఉన్నట్లైతే అతిగా ఆకలి వేయడం లేదా ఆకలి లేకపోవడం, రక్తహీనత, దురద, దగ్గు, వికారం, వాంతులు వంటి సమస్యలు వస్తుంటాయి. అంద

నులిపురుగుల సమస్య పిల్లల్లోనే కాదు పెద్దల్లోనూ కనిపిస్తుంటుంది. నులిపురుగులు కడుపులో ఉన్నట్లైతే అతిగా ఆకలి వేయడం లేదా ఆకలి లేకపోవడం, రక్తహీనత, దురద, దగ్గు, వికారం, వాంతులు వంటి సమస్యలు వస్తుంటాయి. అందువలన ప్రతిరోజూ గోరువెచ్చని నీటిని తీసుకోవలెను. అపరిశుభ్రమైన ప్రాంతాలలో ఆహారం తినకూడదు.
 
పండ్లు, కూరగాయలు పరిశుభ్రంగా కడిగిన తరువాతే వాటిని వినియోగించాలి. ముఖ్యంగా గోళ్లు కొరికే అలవాటు ఉండకూడదు. కడుపులో పురుగులు పెరగకుండా ఉండాలంటే ఇలా చేయాలి. క్యారెట్ తురుమును తరచుగా తీసుకోవడం ద్వారా కడుపులో పురుగులు బయటకు వెళ్లిపోతాయి.

కొబ్బరి తురుమును పిల్లల వయసును బట్టి మూడు లేదా నాలుగు చెంచాలు తినిపించి రెండు గంటల తరువాత పావుచెంచా లేదా అరచెంచా గోరువెచ్చని ఆముదాన్ని తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది.