వేసవిలో బార్లీ నీళ్లు తీసుకుంటే.. మేలేంటి?

సోమవారం, 15 మే 2017 (15:40 IST)

వేసవిలో బార్లీ నీళ్లు సేవించడం ద్వారా చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. బార్లీగింజల్ని నానబెట్టి ఉడికించి వడకట్టిన నీళ్లను వేసవిలో సేవించడం ద్వారా ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. వేసవిలో డీహైడ్రేషన్‌ సమస్యతో బాధపడేవారు.. దీన్ని తీసుకోవచ్చు.

డీహైడ్రేషన్‌ సమస్య అదుపులోకి రావడమే కాదు.. ఎండ ప్రభావం కూడా ఉండదు. మధుమేహం ఉన్నవారూ బార్లీ నీళ్లకు ప్రాధాన్యమిస్తే మేలు. ప్రతిరోజూ తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెరస్థాయుల్లో హెచ్చుతగ్గులుండవు. ఇన్సులిన్‌ కూడా అదుపు తప్పదు. 
 
అలాగే ఉదయం పూట గ్లాసు బార్లీ నీళ్లు తాగితే చాలు. యూరినల్ ఇన్ఫెక్షన్లు, శరీరంలోని టాక్సిన్లు ఇట్టే దూరమవుతాయి. మూత్రపిండం శుభ్రం కావడంతో పాటు.. కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి. బార్లీలో పీచు, బీటా గ్లూకాన్లు అధికం. ఇవి శరీరానికి మేలు చేయడమే కాదు.. జీవక్రియ రేటు కూడా మెరుగుపరుస్తాయి. అలా బరువును అదుపులోకి ఉంచుతాయి. రక్తంలో కొలెస్ట్రాల్‌ శాతం తగ్గించడంలోనూ బార్లీ నీళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. హృద్రోగ సమస్యలూ దరి చేరకుండా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్‌ బి రక్తపోటు సమస్యను దూరం చేస్తుంది. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

గ్రీన్ కాఫీ బీన్స్‌తో 2 నెలల్లోనే బరువు తగ్గొచ్చట.. నిజమేనా?

గ్రీన్ కాఫీ బీన్స్‌తో రెండు నెలల్లోనే బరువు తగ్గొచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ ...

news

మండువేసవిలో బరువు తగ్గించుకోవాలంటే ఇదే అదను.. ఎలా?

వేసవికారణంగానే మన శరీర బరువును బాగా తగ్గించుకోవచ్చనే విషయం ప్రజల అహగాహనలో లేదు. ఇతర ...

news

అన్నంలో కూరకలిపే పద్ధతిని మాని, కూరలో అన్నం కలిపి? (టిప్స్)

అన్నంలో కూరకలిపే పద్ధతిని మాని, కూరలో అన్నం కలిపే అలవాటు చేసుకున్నట్లయితే అది ఆరోగ్యానికి ...

news

బరువు తగ్గాలని డైటింగ్ చేశారో? గోవిందా?

ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా అందానికే ప్రాముఖ్యత ఇస్తే అనారోగ్య సమస్యలు తప్పవు. ...