ప్రతిరోజూ తులసి ఆకుల రసాన్ని తీసుకుంటే?

తులసి ఆకులలో పోషకాలు, ఖనిజాలు, విటమిన్స్, పొటాషియం, ఐరన్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. తులసి ఆకుల్లోని పొటాషియం రక్తహీనతను అదుపులో ఉంచుతుంది. ప్రతిరోజూ తులసి ఆకులను తరచుగా తీసుకుంటే రక్తంలో ఆక్సిజన్ సరఫరా

Kowsalya| Last Updated: శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (10:34 IST)
తులసి ఆకులలో పోషకాలు, ఖనిజాలు, విటమిన్స్, పొటాషియం, ఐరన్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. తులసి ఆకుల్లోని పొటాషియం రక్తహీనతను అదుపులో ఉంచుతుంది. ప్రతిరోజూ తులసి ఆకులను తరచుగా తీసుకుంటే రక్తంలో ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. కాలేయం, మెదడు, గుండె వ్యాధులకు చక్కని ఔషధంగా పనిచేస్తుంది.
 
తులసి ఆకుల రసానికి వృద్ధ్యాపు ఛాయల్ని, చర్మవ్యాధుల్ని నివారించే గుణం ఉంది. తద్వారా శరీర వాపులు, ఉబ్బరం వంటి సమస్యలు తొలగిపోతాయి. జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారు ఈ తులసి ఆకుల రసాన్ని తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. ఆస్తమా వంటి శ్వాస సంబంధిత వ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. 
 
మూత్రపిండాలు, గుండె వ్యాధులు, రేచీకటి, కళ్లు మంటలు వంటి సమస్యలకు తులసి రసాన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించుటకు తులసి ఆకుల రసం మంచిగా ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. దీనిపై మరింత చదవండి :