శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chitra
Last Updated : గురువారం, 26 మే 2016 (15:47 IST)

రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించే మెంతులు

మెంతులు రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. శరీరంలోని గ్లూకోజ్‌ స్థాయిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాదు డయాబెటిస్‌ టైపు 2 వ్యాధితో బాధపడుతున్న వారి రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించడానికి మెంతులు సహకరిస్తుంది. ఎండబెట్టిన మెంతుల్లో ఎక్కువగా ఉన్న ఫైబర్‌ జీర్ణప్రక్రియను వేగవంతం చేస్తుంది. మెంతుల్లో ఎన్నో రకాల విటమిన్లతోపాటు మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌‌లు పుష్కలంగా ఉన్నాయి. 
 
ఎన్నో ఔషధ గుణాలున్న మెంతులు ఆర్థరైటిస్‌, హైకొలెస్ట్రాల్‌, గాయాలు, దద్దుర్లు లాంటి చర్మ సంబంధ వ్యాధులు, బ్రాంకైటిస్‌, మలబద్దకం, జుట్టు ఊడిపోవటం, కురుపులు, కడుపులో వికారం, కిడ్నీ సంబంధ వ్యాధులు, గుండెల్లో మంట, పురుషుల్లో నపుంసకత్వం, ఇతర సెక్సువల్‌ సంబంధ సమస్యల నివారణకు సహకరిస్తుంది. తేలికపాటి డయాబెటిక్‌ ఉన్న వారు రెండున్నర గ్రాముల మెంతులను రోజుకు రెండుసార్లు చొప్పున తీసుకుంటే చక్కెర స్థాయి తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.