శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : శనివారం, 25 ఆగస్టు 2018 (18:19 IST)

ప్రతిరోజూ ఉదయాన్నే నిమ్మరసాన్ని తీసుకుంటే?

ఉదయాన్నే నిమ్మరసాన్ని తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. ప్రతిరోజూ ఉదయాన్నే కాఫీ, టీలకు బదులుగా నిమ్మరసం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణుల సూచిస్తున్నారు. నిమ్మరసాన్ని తీస

ఉదయాన్నే నిమ్మరసాన్ని తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. ప్రతిరోజూ ఉదయాన్నే కాఫీ, టీలకు బదులుగా నిమ్మరసం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణుల సూచిస్తున్నారు. నిమ్మరసాన్ని తీసుకోవడం వలన గ్యాస్ట్రో సిస్టం మెరుగుపడుతుంది.
 
శరీరంలో న్యూట్రిషన్స్, ఇతర మినరల్స్ గ్రహించే శక్తి పెరుగుతుంది. దీన్ని తరుచుగా తీసుకోవడం వలన పలు అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉండవచ్చును. నిమ్మలో ఉండే అల్కలైన్ లక్షణాలు శరీరంలోని మాలిన్యాలను తొలగించడంలో చాలా మంచిగా పనిచేస్తాయి. నిమ్మ అసిడిక్‌గా అనిపించినప్పటికి దీంట్లోని మంచి గుణాలు శరీరంలో సమతుల్యం చేయడంలో చాలా ఉపయోపడుతాయి. 
 
నిమ్మకాయలో ఉండే పెక్టిన్ అనే ప్రత్యేక ఫైబర్ పదార్థం బరువు తగ్గాలనుకునేవారికి దివ్యౌషధంగా సహాయపడుతుంది. దీంతో మెటబాలిజం రేటు మెరుగుపడుతుంది. మసాలాలు, జంక్‌ఫుడ్ వంటివి తిన్నప్పుడు అసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. అటువంటి సమ్యలకు నిమ్మరసం తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.