శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : గురువారం, 9 ఆగస్టు 2018 (17:30 IST)

మెంతికూరతో డయాబెటిస్‌కి చెక్...

మెంతి ఆకులను తీసుకుంటే అనారోగ్య సమస్యల నుండి విముక్తి చెందవచ్చును. శరీరానికి కావలసిన పోషకాలు కూడా పుష్కలంగా అందుతాయి. ఇలాంటి మెంతి కూరలో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం. లివర్ సమస్యలను తొల

మెంతి ఆకులను తీసుకుంటే అనారోగ్య సమస్యల నుండి విముక్తి చెందవచ్చును. శరీరానికి కావలసిన పోషకాలు కూడా పుష్కలంగా అందుతాయి. ఇలాంటి మెంతి కూరలో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం. లివర్ సమస్యలను తొలగించడంలో మెంతికూర చక్కగా పనిచేస్తుంది. శ్వాసకోశ సమస్యలు తొలగిపోతాయి.
 
మెంతికూర ఆకులు రక్తంలోని లిపిడ్ లెవల్స్‌పై మెరుగైన ప్రభావం చూపుతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈ ఆకులను నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని వడగట్టి తీసుకుంటే ఆరోగ్యానికి చక్కగా పనిచేస్తుంది. డయాబెటిస్‌ను నయం చేయడంలో బాగా పనిచేస్తుంది. మెంతి కూరలోని ఔషధ కారకాలు రక్తం గడ్డకట్టకుండా కాపాడుతాయి.  
 
గుండె సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతాయి. ఈ మెంతి కూరలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర కణజాలాన్ని రక్షిస్తాయి. చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడంలో మెంతి కూర చక్కగా ఉపయోగపడుతుంది. ఈ మెంతి ఆకులను పేస్ట్‌లా చేసుకుని జుట్టుకు రాసుకోవాలి. అరగంట తరువాత తలస్నానం చేస్తే వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి.