శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: శుక్రవారం, 27 మే 2016 (21:58 IST)

ముఖం, ముక్కుపై నల్లటి మచ్చలా... ఈ చిట్కాలు పాటించండి...

ముఖంపై నల్లటి మచ్చలు తొలగించుకోవాలంటే.. ఇంటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. బంగాళా దుంపను ముక్కలుగా కోసి మచ్చలు ఉన్న చోట బాగా మర్దన చేసి ఆ తర్వాత కాటన్‌తో క్లీన్ చేస్తే సరిపోతుంది. అలాగే తేనెను కూడా కాసింత తీసుకుని బ్లాక్ హెడ్స్ ఉన్న చోట రాసుకుని, మర్

ముఖంపై నల్లటి మచ్చలు తొలగించుకోవాలంటే.. ఇంటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. బంగాళా దుంపను ముక్కలుగా కోసి మచ్చలు ఉన్న చోట బాగా మర్దన చేసి ఆ తర్వాత కాటన్‌తో క్లీన్ చేస్తే సరిపోతుంది. అలాగే తేనెను కూడా కాసింత తీసుకుని బ్లాక్ హెడ్స్ ఉన్న చోట రాసుకుని, మర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. తేనెను సన్నని సెగపై లైట్‌గా వేడి చేసి దానిని బ్లాక్ హెడ్స్‌పై అప్లై చేయాలి. 
 
అలాగే ఒకటిన్నర దాల్చిన చెక్క పొడిని ఒక స్పూన్ తేనెతో కలిపి బ్లాక్ హెడ్స్ ఉన్న చోట అప్లై చేసి ఐదు లేదా పది నిమిషాల తర్వాత కడిగేస్తే అవి తొలగిపోతాయి. ముఖానికి ఆవిరి పట్టించడం, టమోటా గుజ్జును ఫేస్ ప్యాక్‌లా వేసుకోవడం, పాలతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం, ఎగ్ ప్యాక్, అలోవెరా ప్యాక్, సున్నిపిండి ప్యాక్, పెరుగు గుజ్జుతో బ్లాక్ హెడ్స్‌పై ప్యాక్ వేసుకుంటే అవి సులువుగా తొలగిపోయి.. ముఖ సౌందర్యం పెంపొందుతుంది.