శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , శుక్రవారం, 19 మే 2017 (11:07 IST)

మండు వేసవిలో మలయమారుతం ఖర్బుజా

వేసవిలో వేడిగాలులు, దప్పిక నుంచి శరీరాన్ని రక్షించే గుణం గల ఖర్బూజా పండు అధిక బరువును తగ్గించటంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. అధిక బరువుతో బాధపడేవారు రాత్రిపూట భోజనం మానివేసి ఓ వంద లేదా రొండొందల గ్రాముల

వేసవిలో వేడిగాలులు, దప్పిక నుంచి శరీరాన్ని రక్షించే గుణం గల ఖర్బూజా పండు అధిక బరువును తగ్గించటంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. అధిక బరువుతో బాధపడేవారు రాత్రిపూట భోజనం మానివేసి ఓ వంద లేదా రొండొందల గ్రాముల వరకు ఖర్బూజా ముక్కలను సలాడ్ రూపంలో తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఖర్బూజాలో లభించే కెలోరీలు శరీరానికి శక్తిని అందిస్తే, పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచటం, మూత్రపిండాల్లో రాళ్లు తయారు కాకుండా ఆపటం లాంటివి చేస్తుంది. పీచు అధికంగా లభించే ఈ పండును కొద్దిగా తిన్నా, కడుపునిండా తిన్న భావన కలుగుతుంది. మలబద్ధకం సమస్యను తగ్గించటంలో ఖర్బూజా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
 
ఖర్బూజా పండులో లభించే విటమిన్ ఏ కంటిచూపు మెరుగుపడుతుంది. ఇందులోని విటమిన్ సీ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేసి గుండెనొప్పి, క్యాన్సర్ లాంటి రోగ కారకాలపై పోరాడుతుంది. ఈ పండులోని ఫోలిక్ ఆమ్లం గర్భిణులకు వరం లాంటిదే. ఇక బాలింతలు ఈ పండును తీసుకోవటంవల్ల పాలు బాగా పడతాయి. చర్మంపై దురదలు, ఎగ్జిమా కలిగినవారికి ఈ పండు ఓ మంచి ఔషధం అని చెప్పవచ్చు.

ఖర్బూజా రసాన్ని ప్రతిరోజూ తీసుకోవటంవల్ల ఎసిడిటీ, అల్సర్లనుంచి ఉపశమనం లభిస్తుంది. మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. ఈ పండు తొక్కను కషాయంలా చేసి కొబ్బరినీటితో కలిపి తీసుకుంటే మూత్ర  సంబంధ సమస్యలు మాయమవుతాయి. వీటి గింజలను ఆహారంతోపాటు తీసుకుంటే శరీరం బరువు పెరుగుతుంది.