శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (20:42 IST)

ఈ ప్రకారంగా భోజనం చేస్తుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవు

భోజనం ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తినాలన్నది ఇప్పుడు పట్టించుకోవడం లేదు. కానీ అలా పట్టించుకోకపోవడం వల్లనే అనారోగ్యం బారిన పడే పరిస్థితి వస్తుంది. ఆయుర్వేదం ప్రకారం భోజనం మూడువిధాలుగా తీసుకోవాలి. ఆహారం తీసుకునేటప్పుడు జీర్ణ సంబంధ బాధలు లేక

భోజనం ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తినాలన్నది ఇప్పుడు పట్టించుకోవడం లేదు. కానీ అలా పట్టించుకోకపోవడం వల్లనే అనారోగ్యం బారిన పడే పరిస్థితి వస్తుంది. ఆయుర్వేదం ప్రకారం భోజనం మూడువిధాలుగా తీసుకోవాలి. ఆహారం తీసుకునేటప్పుడు జీర్ణ సంబంధ బాధలు లేకుండా ఉండాలంటే మూడు ముఖ్యమయిన నియమాలను పాటించాలని ఆయుర్వేదం చెపుతుంది. 
 
వాటిలో మొదటిది హితభుక్త.... శరీరానికి మేలు చేసే ఆహారం సుళువుగా జీర్ణమయ్యేదానిని హితభుక్తగా నిర్దేశించింది. 
 
మితభుక్త... అవసరం మేరకు తినడం, అధికంగా తినకపోవడం, ఎక్కువసార్లు తినకపోవడం, సమయపాలన, ఎక్కువ పదార్థాలు తినకపోవడాన్ని మితభుక్త.
 
ఋతుభుక్త... ఆయా ఋతువుల్లో లభ్యమయ్యే ఆహారం తప్పనిసరిగా తినడం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రకృతి ప్రసాదించే ఆహారంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం - ఋతుభుక్తగా నిర్దేశించారు. ఈ ప్రకారంగా భోజనం చేస్తుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవు.