అజీర్తితో బాధపడుతున్నారా? ఈ చిట్కాలు పాటిస్తే?

శుక్రవారం, 13 జులై 2018 (09:54 IST)

కొన్ని ఆహార పదార్ధాలు ఎక్కువగా తినడం వలన అజీర్తి కలుగుతుంది. అటువంటపుడు దానికి విరుగుడుగా కొన్ని పదార్ధాలను తీసుకోవడం అజీర్తి నుండి ఉపశమనం పొందవచ్చును. మాంసాహారం ఎక్కువగా తీసుకున్నప్పుడు కలిగే అజీర్తికి విరుగుడుగా కాంజికం త్రాగాలి. కాంజికం అంటే అన్నాన్ని పులిసేవరకూ నీళ్ళలో నానబెట్టి పిండి వడగట్టగా వచ్చిన దాన్ని కాంజికం అంటారు.
 
చేపలు ఎక్కువగా తిన్నప్పుడు కలిగే అజీర్తికి మూడుపూటల ఒక్కో గ్లాసు మజ్జిగ త్రాగితే మంచిది. నేతితో తయారుచేసిన పదార్ధాలను ఎక్కువగా తీసుకోవడం వలన కలిగే అజీర్తిలో దప్పిక అధికంగా ఉంటుంది. కడుపులో వికారంగా ఉంటుంది. అలావున్నప్పుడు నిమ్మరసాన్ని మజ్జిగలో కలిపి కొంచెం ఉప్పు వేసుకుని తీసుకుంటే వికారం నుండి విముక్తి చెందవచ్చును.
 
నిమ్మ, నారింజ, ద్రాక్షాల వంటి పుల్లటి పదార్ధాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు కలగే అజీర్తికి కొద్దిగా బెల్లం తీసుకుంటే చాలు. ఉలవచారు, ఉలవలు, గుగ్గిళ్ళు ఎక్కువగా తీసుకున్నప్పుడు కలిగే అజీర్తికి నెయ్యిగాని, వెన్నగాని తీసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. రాత్రులు చపాతీలు ఎక్కువగా తీసుకోవడం వలన కలిగే అజీర్తికి దోసకాయ కూరను తీసుకుంటే అజీర్తి కలగదు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

మూడీగా వున్నారా? అలా ఎండలో కాసేపు నిలబడితే..?

మూడీగా వున్నారా? అయితే ఎండలో కాసేపు గడపండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. పని ఒత్తిడి, ...

news

చెవినొప్పికి ముల్లంగి నూనెను తీసుకుంటే?

ముల్లంగి దుంపల్లో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయ. ముల్లంగి ఆకుల్లో క్యాల్షియం, పాస్పరస్, ...

news

టైమ్ పాస్ కోసం తింటున్నారా..? ఐతే జాగ్రత్త సుమా..

టైమ్ పాస్ కోసం.. ఆకలేయకపోతున్నా.. సరదాగా స్నేహితులతో కలిసి తింటున్నారా..? అయితే అనారోగ్య ...

news

నైట్ డ్యూటీలతో ప్రాణాలకు ముప్పు...

రాత్రిపూట విధులు నిర్వహించే ఉద్యోగుల ఆరోగ్యానికి ముప్పు పొంచివుంది. నైట్ షిప్టుల్లో ...