బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : గురువారం, 2 ఆగస్టు 2018 (10:36 IST)

మామిడి టెంకను పారేస్తున్నారా... ఇలా చేస్తే...

వర్షాకాలం వచ్చినా కూడా మామిడికాయలకు మాత్రం కొరవుండదు. ఈ మామిపికాయలో గల టెంకలో ఆరోగ్య ప్రయోజానాలు చాలా ఉన్నాయి. చాలామంది ఈ మామిడి టెంకను పరేస్తుంటారు. అటువంటి వారికి ఈ మామిడి టెంకలో గల ఆరోర్య విషయాలను

వర్షాకాలం వచ్చినా కూడా మామిడికాయలకు మాత్రం కొరవుండదు. ఈ మామిపికాయలో గల టెంకలో ఆరోగ్య ప్రయోజానాలు చాలా ఉన్నాయి. చాలామంది ఈ మామిడి టెంకను పరేస్తుంటారు. అటువంటి వారికి ఈ మామిడి టెంకలో గల ఆరోర్య విషయాలను తెలుసుకుందాం.
 
మామిడి టెంకను పొడి చేసుకుని జీలకర్ర, మెంతుల పొడితో సమానంగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ అన్నంలో కలుపుకుని తీసుకోవడం వలన శరీరంలోని వేడిని తగ్గించుటకు చాలా ఉపయోగపడుతుంది. ఉదరసంబంధ వ్యాధులకు కూడా ఈ మామిడి టెంక మంచి ఔషధంగా పనిచేస్తుంది. అంతేకాకుండా గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుండి విముక్తి కలిగిస్తుంది. 
 
ఈ మామిడి టెంకను పొడిచేసి మజ్జిగలో కలుపుకుని తీసుకుంటే కడుపు ఉబ్బరం నుండి ఉపశమనం లభిస్తుంది. మామిడి టెంక చూర్ణాన్ని ప్రతిరోజూ తేనెలో కలుపుకుని తీసుకుంటే ఉబ్బసం తగ్గుతుంది. గొంత సమస్యలు తొలగిపోతాయి. ఈ టెంకలో గల జీడిని పొడి చేసుకుని మాడుకు రాసుకుంటే చుండ్రు సమస్యలకు మంచిగా సహాయపడుతుంది. 
 
ఈ టెంక ఉండే ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్, విటమిన్స్ జుట్టుకు పోషణనిస్తాయి. వెంట్రుకలను దృఢంగా పెరిగేలా సహాయపడుతాయి. తెల్లజుట్టుకు టెంక పొడిలో కొబ్బరి, ఆలివ్, ఆవ నూనెలు కలుపుకుని జుట్టుకు రాసుకుంటే కురులు నల్లగా మారుతాయి. అంతేకాకుండా ఈ మామిడి టెంక పొడిలో వెన్నను కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం అందంగా, కాంతివంతంగా మెరిసిపోతుంది.